Pawan Kalyan – SaiDharam Tej : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ‘బ్రో’.. మండిపడుతున్న ఫ్యాన్స్

ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో గోపీచంద్ హీరో గా నటించిన 'రామబాణం' అనే చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసంగా #PKSDT మూవీ టైటిల్ ని చెప్పకుండా ఇన్ని రోజులు ఆగారు.

Written By: Vicky, Updated On : May 9, 2023 12:51 pm
Follow us on

Pawan Kalyan New Movie Title: పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి #PKSDT..తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతుంది. అయితే రిలీజ్ కి సరిగ్గా 3 నెలల సమయం కూడా లేదు, ఇలాంటి సమయం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి టైటిల్ ని ఖరారు చెయ్యలేదని , మేకర్స్ పై ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఫుల్ ఫైర్ మీద ఉన్నారు.

ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో గోపీచంద్ హీరో గా నటించిన ‘రామబాణం’ అనే చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసంగా #PKSDT మూవీ టైటిల్ ని చెప్పకుండా ఇన్ని రోజులు ఆగారు.

ఈ చిత్రానికి టైటిల్ ‘దేవుడే దిగి వచ్చినా’, ‘దేవర’ అంటూ రకరకాలుగా ప్రచారం అయ్యింది.’దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ని దాదాపుగా ఖరారు చేసేసినట్టు ప్రచారం సాగింది. కానీ ఈ రెండు టైటిల్స్ కాకుండా , ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ని ఖారారు చేసినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.

ఈ టైటిల్ ని రేపు కానీ, ఎల్లుండి కానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరియు పవన్ కళ్యాణ్ ఒకరిని ఒకరు బ్రో అని పిలుచుకుంటూ ఉంటారని, అందుకే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కి ఇలాంటి టైటిల్ పెడితే ఫ్యాన్స్ రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.