Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీ అనగానే పైకి అందరికీ రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ ఇందులో అవకాశాలు రావాలంటే జీవితాలు గడిచిపోతాయి. కొందరు ఒక్క ఛాన్స్ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. మరికొందరికి ఏమాత్రం చెమటోట్చకుండా చాన్సెస్ వస్తాయి. ఒకప్పటి స్టార్ హీరోల్లో చాలా మందికి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు. స్వయంగా కష్టపడి ఎదిగిన వాళ్లే. ఇలాంటి వారిలో ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు. అయితే ఇప్పుడున్న వాళ్లల్లో చాలా మంది వారసత్వం పుచ్చుకున్నవాళ్లే. కానీ కొందరు మాత్రం ఎంతో కష్టపడితే గానీ సినిమాల్లో నటించే అవకాశం రాలేదని అంటున్నారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. రౌడీ హీరోలా పైకి కనిపించే విజయ్ దేవరకొండను చూస్తే ఆయనకు పెద్ద సినీ సపోర్టు ఉందని అనుకుంటారు. కానీ ఆయన కుడా ఛాన్సెస్ కోసం కొన్ని రోజుల పాటు వెయిట్ చేశాడన్న విషయం చాలా మందికి తెలియదు. మే 9న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆ వివరాలు మీకోసం.
విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించారు. నాగర్ కర్నూలు జిల్లా తుమన్పెట్ గ్రామానికి చెందిన దేవరకొండ గోవర్దన్ రావు, మాధవిలు ఆయన తల్లిదండ్రులు. స్కూల్ స్టడీస్ అంతా సొంత గ్రామంలోనే సాగిన విజయ్ చదువు ఆ తరువాత హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ కళాశాలలో కొనసాగించారు. చిన్నప్పుడు ఈయన నాటకాల్లో ఎక్కువగా నటించేవారు. ‘సూత్రధార్’ అనే నాటకంలో మూడు నెలల వర్క్ షాప్ లో పాల్గొని హైదరాబాద్ థియుటర్ సర్క్యూట్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఇండస్ట్రీపై ఆసక్తి పెరిగింది.
అయితే సినిమాల్లో నటించాలని ఎంతో ట్రై చేశారు. నిర్మాతల చుట్టూ తిరిగాడు. కొన్ని సంవత్సరాల పాటు వెంటప్డడా ఛాన్సెస్ రాలేదు. దీంతో నటుడు అవుదామనుకున్న ఆయన కోరిక తీరదేమో అనుకున్నాడు. ఆ తరువాత డైరెక్టర్ శాఖలో చేరాడు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ ఛానెళ్లలో ఆయన డైరెక్షన్ చేసిన సీరియళ్లు ప్రసారం అయ్యాయి. ఆ తరువాత రవిబాబు డైరెక్షన్లో ‘నువ్విలా’ సినిమా కోసం విజయ్ ని సంప్రదించారు. ఇందులో చిన్న పాత్రే అయినా విజయ్ నటించేందుకు ఒప్పుకున్నాడు. కానీ అప్పుడు విజయ్ ని ఎవరూ గుర్తించలేదు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలోనూ సైడ్ హీరోగా కనిపించాడు. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమా హిట్టయితే అ హీరోలకు మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఈ మూవీ ప్లాప్ కావడంతో విజయ్ మరోసారి నిరాశ చెందాడు. అయితే తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ సినిమాలో మెయిన్ హీరోగా అవకాశం వచ్చింది. మొదట్లో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కానీ చాన్స్ మిస్ చేసుకోవద్దని నటించారు. కానీ ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఇక సందీప్ వంగా డైరెక్షన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఎన్ని సంచలనాలు సృష్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అప్పటి నుంచి విజయ్ కి తిరుగులేకుండా పోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన ‘లైగర్’లో విజయ్ పర్ఫామెన్స్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయనకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సమంత హీరోయిన్ తో కలిసి ‘ఖుషీ’ లో నటిస్తున్నారు.సాధారణం సినిమాల్లో నటిస్తామంటే ఏ తండ్రియనా ఒప్పుకోరు. కానీ విజయ్ తండ్రి స్ఫూర్తితోనే ఆయన స్టార్ గా ఎదిగానని విజయ్ పలు ఇంటర్యూలో చెప్పాడు.