https://oktelugu.com/

Shruti haasan : గోత్ థీమ్ తో క్రిస్మస్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్…

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా తమదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ ఆయా సినిమాల విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 26, 2024 / 08:54 AM IST

    Shruti haasan

    Follow us on

    Shruti haasan : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా తమదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ ఆయా సినిమాల విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు హీరోలతో పాటు సరి సమానమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక అలాంటి వాళ్లలో శృతిహాసన్ కూడా ఒకరనే చెప్పాలి.

    ఇక ఈరోజు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సెలబ్రిటీలు సైతం ఈ పండుగా ను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇక తెలుగులో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతిహాసన్ సైతం క్రిస్మస్ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడమే కాకుండా తన అభిమానుల కోసం తన ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది…ఇక గోత్ థీమ్ తో క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్న తను చాలా ఎంజాయ్ చేసినట్టుగా పోస్ట్ లో తెలియజేసింది. మరి మొత్తానికైతే ప్రస్తుతం సినిమాలు చేయడంలో కొంతవరకు వెనకబడినప్పటికి తనదైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటూ తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఫొటోస్ షేర్ చేస్తూ తన అప్డేట్స్ ను తెలియజేస్తూ ఉంటుంది… ఇక ఇదిలా ఉంటే 2023 వ సంవత్సరంలో సలార్ సినిమాతో మంచి విజయాన్ని సాధించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా సినిమాలేవి చేయకపోయినా కూడా ఇప్పుడు సలార్ 2 సినిమాతో మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతుంది.

    ఇక చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సాధించే సీనియర్ హీరోలతో సైతం సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోయిన్ గా మంచి గుర్తింపైతే సంపాదించుకుంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ భారీ విజయాలను సాధిస్తుంది. మరి ఇక మీదట కూడా ఆమె మరికొన్ని పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పుడు సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా తను కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడొచ్చే సీనియర్ హీరోలందరు కూడా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో కూడా ఆమె నటించి మెప్పించడం విశేషం… ఇక బాలయ్య బాబుతో చేసిన వీర సింహారెడ్డి కూడా సాధించి ఆమె కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయిందనే చెప్పాలి…

    ఇక ఏది ఏమైనా కూడా ఆమె కమల్ హాసన్ కూతురి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం శృతిహాసన్ చాలా మంచి ఫామ్ లో ఉందనే చెప్పాలి. మరి తన ఫామ్ ను ఇక ముందు రోజుల్లో కూడా కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…