https://oktelugu.com/

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!

కొద్ది నెలలుగా వర్షాలు ఏపీకి చికాకు పెడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడు మాత్రం వరుస ముసురులతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 26, 2024 / 08:49 AM IST

    AP Rains

    Follow us on

    AP Rains: ఏపీలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.చాలా జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వరుస అల్పపీడనాలతో వర్షాల ముప్పు తప్పడం లేదు. తాజాగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజా హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడనుంది. అయితే దాని ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర పై ఉంటుంది. దక్షిణ కోస్తాలో సైతం కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది.

    * మరో మూడు రోజుల పాటు వర్షాలు
    గడిచిన 24 గంటల్లో చాలా చోట్ల వర్షపాతం నమోదు అయింది. ప్రధానంగా బొబ్బిలి, పార్వతీపురం లో 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులు పాటు ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం తరువాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

    * అల్పపీడనం బలహీనపడినా
    వాస్తవానికి ఈ అల్పపీడనం బలహీన పడింది. అయితే తీరానికి సమీపంలో స్థిరంగా ఉండటంతో చాలా జిల్లాల్లో మేఘావృతమై ఉంది. మరోవైపు చలిత్య వ్రత పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలతో ముఖం పట్టాయి. చాలా జిల్లాల్లో 3 నుంచి 7 డిగ్రీలు ఒకేసారి తగ్గినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. చాలా జిల్లాల్లో అయితే ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలి, ఒక మంచుతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.