Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో చివరి దశకు వచ్చేసింది. ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్కులు ఎంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ అందరూ ఎలా అయినా టికెట్ టు ఫినాలే గెలవాలి అనే కసితోనే ఆడుతున్నారు. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా నేరుగా ఫైనల్స్ లోకి వెళ్లడం నిజంగా అదృష్టమే కదా. అయితే ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ లకు మంచి ఓటింగ్ పడుతుంది అనే విషయం వాళ్లకు తెలుసు. అయినప్పటికీ కూడా కన్నింగ్ ఆలోచనలు చేసి చివరి వరకు గేమ్ లో ఉంటూ, టికెట్ టు ఫినాలే గెలవాలని చూసారు. ఇలా చేస్తే వాళ్ళ లక్ష్యం చేరుకోవచ్చేమో కానీ, టైటిల్ రేస్ లో మాత్రం బాగా వెనుకబడిన వారు అవుతారు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ కలిసి ఆడిన గ్రూప్ గేమ్ చాలా దారుణం అనే చెప్పాలి.
Also Read: ‘బిగ్ బాస్ 9’ ఫస్ట్ ఫైనలిస్ట్, టాప్ 5 ఫైనలిస్ట్స్ ఎవరో తెలిసిపోయిందిగా…
వీళ్ళతో పాటు రీతూ చౌదరి కూడా ఉంది. ముందుగా రంగుల టాస్క్ లో రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ స్పష్టంగా గ్రూప్ గేమ్ ఆడినట్టు కళ్ళకు కనిపిస్తోంది. రీతూ కలర్ ని పవన్ కళ్యాణ్ చెరపలేదు, పవన్ కళ్యాణ్ కలర్ ని రీతూ చెరపలేదు. ఇద్దరు కలిసి భరణి ని టార్గెట్ చేసి ఓడించారు. ఇక ఆ తర్వాతి టాస్క్ లో భరణి పవన్ కళ్యాణ్ తో సుమన్ శెట్టి ని తియ్యకు, నా వైపు ప్లాంక్ వెయ్యి, నువ్వు నేను ఆడుకుందాం అని అంటాడు. కానీ పవన్ కళ్యాణ్ సుమన్ తో ఆడితే చాలా తేలికగా గెలవొచ్చు అని అతని వైపు ప్లాంక్ వేసి గేమ్ ఆడి ఓడిస్తాడు. ఇలా నిన్న మొత్తం ఈ ముగ్గురు ఎలా అయినా భరణి, సుమన్ శెట్టి లను గేమ్ నుండి తప్పించాలి అనే ఉద్దేశ్యం తోనే ఆడారు.
ఇదంతా పక్కన పెడితే నిన్న రీతూ, భరణి మధ్య జరిగిన చివరి టాస్క్ ని మీరంతా చూసే ఉంటారు. సరైన ట్రైయాంగిల్ పెట్టలేదని భరణి వాదిస్తాడు. తనూజ కూడా ఆ ట్రైయాంగిల్ ని గుర్తిస్తుంది. కానీ సంజన మాత్రం సరైన ట్రైయాంగిల్ అనే చెప్తుంది. ఎపిసోడ్ కూడా రీతూ చౌదరి కి సానుకూలంగా కట్ చేశారు. అసలు నిజం లైవ్ చూసిన వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రైయాంగిల్ షేప్స్ కొన్ని తికమక గా ఇస్తాడు. వాటి నుండి సరైన ట్రైయాంగిల్ షేప్ ని వెతికి పెట్టాలి. భరణి సంచాలక్ గా వ్యవహరిస్తున్న సంజన కి ఇదే చెప్తాడు. కానీ ఆమె పట్టించుకోదు,రీతూ ని విన్నర్ గా ప్రకటిస్తుంది. అంతే కాదు, భరణి వేసిన రింగ్ ని కూడా రీతూ చౌదరి నొక్కేసి టీ షర్ట్ లో దాచుకుంటుంది. ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో చూడాలి.