Bigg Boss 9 Telugu Pawan Kalyan: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) టికెట్ టు ఫినాలే టాస్కులు ఎంతో ఆసక్తికరంగా, ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. నిన్నటితో టాస్కులు మొత్తం పూర్తి అయ్యాయి. టికెట్ టు ఫినాలే గెలిచి పవన్ కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విధంగా నిరాశ కలిగించే వార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టైటిల్ రేస్ లో ఉన్నాడు. తనూజ కి, పవన్ కళ్యాణ్ కి ఓటింగ్ లో పెద్దగా తేడా లేదు, ఇద్దరిలో ఎవరైనా టైటిల్ కొట్టొచ్చు. కానీ నామినేషన్స్ లో కచ్చితంగా ఉండాలి. లేదంటే ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి, వచ్చే వారం అతన్ని నామినేట్ చేసేందుకు వీలు లేదు. తనూజ నామినేషన్స్ లోకి వస్తుంది, కాబట్టి ఆమెకు ఓటింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ ఫస్ట్ ఫైనలిస్ట్, టాప్ 5 ఫైనలిస్ట్స్ ఎవరో తెలిసిపోయిందిగా…
ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తనూజ, పవన్ కళ్యాణ్ మరియు ఇమ్మానుయేల్ కి తప్ప, ప్రతీ ఒక్కరికి టికెట్ టు ఫినాలే గెలవడం ముఖ్యమే. ఎందుకంటే టాప్ 5 లో టాప్ 3 మాత్రమే ఫిక్స్ అయ్యింది. మిగిలిన రెండు స్థానాలు ఖరారు కాలేదు. ఇందుకోసం పోటీ పడుతున్న 5 మందికి దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ జరుగుతుంది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ ఇలా జరగలేదు. వీరిలో ఎవరు గెలిచినా వాళ్లకు మామూలు లాభం ఉండేది కాదు. ఈ టాస్క్ లో ఒక్కొక్కరుగా తొలగిపోతూ చివరికి భరణి, రీతూ చౌదరి , పవన్ కళ్యాణ్ మరియు ఇమ్మానుయేల్ మిగులుతారు. అందరూ భరణి లేదా రీతూ చౌదరి లలో ఎవరో ఒకరు మొదటి ఫైనలిస్ట్ అయితే బాగుండును అని అనుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ చౌదరి మరియు భరణి మధ్య పోటీ జరిగింది.
ఈ పోటీ లో రీతూ చౌదరి గెలిచినట్టు చూపిస్తారు. కానీ భరణి కి చాలా అన్యాయం జరిగింది. మోసం చేసి గెలిచారు. సంజన కూడా సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది. ఇక చివర్లో ఇమ్మానుయేల్, రీతూ చౌదరి మధ్య పోటీ జరగ్గా, ఇమ్మానుయేల్ ఈ పోటీ లో ఓడిపోయి టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకుంటాడు అట. ఇక చివరికి రీతూ చౌదరి మరియు కళ్యాణ్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ పోటీ లో పవన్ కళ్యాణ్ గెలిచి ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ గా జెండా పాతుతాడు. ఇది ఆయన ఓటింగ్ పై ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.