https://oktelugu.com/

Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్ పై మొట్టమొదటిసారి స్పందించిన పవన్ కళ్యాణ్..నినాదాలు చేస్తున్న అభిమానులపై మండిపాటు!

గత 20 రోజుల నుండి నేషనల్ మీడియా లో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటన ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 28, 2024 / 02:56 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : గత 20 రోజుల నుండి నేషనల్ మీడియా లో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటన ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. దేశవ్యాప్తంగా నటీనటులు కూడా ఈ వ్యవహారం పై స్పందించారు. మొత్తం మీద ఈ ఘటన పట్ల ఇండస్ట్రీ మొత్తం కదిలి సీఎం రేవంత్ రెడ్డి ని కలవాల్సి వచ్చింది. ఇంత వ్యవహారం నడుస్తుంటే మెగా ఫ్యామిలీ లో ఒక్కరు కూడా ఈ ఘటనపై బహిరంగంగా మాట్లాడడం ఇప్పటి వరకు మనం చూడలేదు. చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు ఆయన ఇంటికి వెళ్లారు కానీ, ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసాడు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న కడప లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ గాలివీడు ఎంపీడీఓ జవహార్ బాబు ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. దాడి చేసిన వైసీపీ నాయకులపై ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చాలా తీవ్రమైన యాక్షన్స్ తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. జవహర్ బాబు ని మరియు అతని కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియా సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ సమావేశం చివర్లో ఒక రిపోర్టర్ ‘సార్..అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని అడగగా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటి..?, హాస్పిటల్ దగ్గర మీరు ఇలాంటి ప్రశ్నలా అడిగేది. ఈ ఘటనపై సంబంధిత ప్రశ్నలు మాత్రమే వెయ్యండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇక ఆయన మీడియా తో మాట్లాడుతున్నంతసేపు అక్కడికి వచ్చిన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. ‘బాబులకు బాబు కళ్యాణ్ బాబు’, ‘ఓజీ..ఓజీ’ అంటూ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా చేసారు. దీనికి మండిపడ్డ పవన్ కళ్యాణ్ ‘ఏంటయ్యా మీరు..ఎక్కడ ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదా మీకు’ అంటూ చిరాకు పడ్డాడు. ఇలా పవన్ కళ్యాణ్ చిరాకు పడడం తొలిసారి కాదు, గతంలో రెండు మూడు సార్లు కూడా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి హోదా లో ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడికి అభిమానులు వచ్చి పెద్ద ఎత్తున ఓజీ, ఓజీ అని నినదిస్తున్నారు. నేను సినిమా ఫంక్షన్ కోసం రాలేదు, అభివృద్ధి కార్యక్రమం కోసం వచ్చాను అని ఆయన చెప్పినప్పటికీ కూడా అభిమానులు ఆపడం లేదు. దీంతో ఈరోజు ఆయన ఇంకా కాస్త చిరాకు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.