https://oktelugu.com/

Pawan Kalyan- Anchor Pradeep: పవన్ కళ్యాణ్ సినిమాకి నిర్మాతగా యాంకర్ ప్రదీప్.. కేవలం యాంకరింగ్ తో ఇంత సంపాదించాడా!

గత కొంత కాలం క్రితం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు.అలా హీరో గా , యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకున్న ప్రదీప్, ఒక సినిమాని నిర్మించాలనే కోరిక ఉందని, తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 31, 2023 / 08:08 AM IST

    Pawan Kalyan- Anchor Pradeep

    Follow us on

    Pawan Kalyan- Anchor Pradeep: బుల్లితెర పై స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే అందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. తన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ప్రదీప్ స్పెషాలిటీ. ముఖ్యంగా ‘ఢీ’ షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి ఆయన చేసిన సందడి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు, వీళ్లిద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద చూస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే.

    ఆ తర్వాత ప్రదీప్ మాటీవీ మరియు జీ టీవీ లో కూడా ఎన్నో షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ షో లో తనకి ఉన్న పలుకుబడి తో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ అందరితో చిట్ చాట్ చేస్తుండేవాడు.

    గత కొంత కాలం క్రితం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు.అలా హీరో గా , యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకున్న ప్రదీప్, ఒక సినిమాని నిర్మించాలనే కోరిక ఉందని, తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

    ఈ మాట విని ఒక్కసారిగా అందరూ షాక్ , పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వందల కోట్ల రూపాయలతో బిజినెస్ చేస్తున్నట్టు. ఆయన రెమ్యూనరేషన్ దాదాపుగా వంద కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అలాంటిది ప్రదీప్ అంత తేలికగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని చెప్పడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.