Pawan Kalyan : ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం చేసే గొప్ప మనసు ఉన్న మన టాలీవుడ్ హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. ఆయన వద్దకు ఎవరైనా సహాయం కోరడానికి వెళ్తే, ఉత్త చేతులతో పంపించినట్టు చరిత్రలో లేదు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే గుణం ఏ రేంజ్ లో ఉందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మా రాష్ట్రానికి కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులూ కావలి అంటూ ఇతర రాష్ట్రాలకు చెందిన నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప దాతృత్వ గుణాన్ని చాటుకొని ఒక ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రాణాలను కాపాడాడు. ఆ క్యారక్టర్ ఆర్టిస్టు మరెవరో కాదు ఫిష్ వెంకట్.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ విలన్ గా నటించిన ఈయన, ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని అంత్యాక్షరి సన్నివేశం ద్వారా ఏ రేంజ్ పాపులారిటీ ని సంపాదించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఫిష్ వెంకట్ ప్రతీ తెలుగు సినిమాలో రౌడీ గ్యాంగ్ లో ఒకడిగా ఉండేవాడు. అవకాశాల వెల్లువ కురిసేది. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండుంటే ఇప్పటికీ అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగేవాడు, కానీ ఆయన ఆరోగ్యం అసలు ఏమాత్రం బాగాలేదు. చాలా కాలం నుండి ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. షూటింగ్ కి వెళ్లేందుకు శరీరం సహకరించకపోవడంతో పాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా సోకడం వల్ల దెబ్బ తిన్న ఆయన కాళ్ళు పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వెంటనే ఫిష్ వెంకట్ కి ఆర్థిక సాయం అందించి, ఆయన వైద్యానికి కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటానని భరోసా ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ తనకి చేసిన సాయం గురించి ఫిష్ వెంకట్ ఒక వీడియో ద్వారా తెలుపుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘గత కొంత కాలం నుండి నా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. చాలా క్రిటికల్ సిట్యుయేషన్ కి వెళ్ళిపోయాను. బీపీ, షుగర్ పెరగడం వల్ల నా కాళ్ళు పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురి అయ్యింది. అదే విధంగా కిడ్నీ కూడా ఒకటి చెడిపోవడం తో రోజు మార్చి రోజు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఆర్థికంగా కూడా బాగా కృంగిపోయాను. నాకు తెలిసిన సన్నిహితులు నీకు ఇండస్ట్రీ లో ఎంతోమంది పెద్దవాళ్ళు తెలుసు కదా, ఎవరినైనా సహాయం అడుగు అని చెప్పారు. నాకు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తుకు వచ్చాడు. ఆయన దగ్గరకి వెళ్ళగానే నా బ్యాంక్ అకౌంట్ లో నాలుగు లక్షల రూపాయిలు వేసి, నా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేస్తానని భరోసా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి రుణాన్ని ఈ జీవితం లో మర్చిపోలేను. నా తల్లిదండ్రుల తర్వాత నేను రుణపడేది ఆయనకీ ఒక్కటే’ అంటూ ఆయన ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు.
❤️ @PawanKalyan pic.twitter.com/S1TKrxwQZI
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) January 1, 2025