https://oktelugu.com/

Ram Charan : అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్..’గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రామ్ చరణ్ డుమ్మా!

సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 04:25 PM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఘటన తర్వాత హీరోలు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ కోసం థియేటర్స్ కి రావాలన్నా హడలిపోతున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో వస్తే కచ్చితంగా జనాలు విపరీతంగా రావడం సహజం. ఆ ప్రభావం కారణంగా మొన్న జరిగినట్టు తొక్కిసలాట ఘటన జరిగి ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం జరిగితే సదరు హీరోయిన్ మానసికంగా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యే పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నందున, సాధ్యమైనంత వరకు హీరోలు వీటిని పూర్తిగా దూరం పెట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.

    ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి వస్తున్నాడు. హైదరాబాద్ లోని AMB మాల్ లో ఈ ఈవెంట్ జరగనుంది. సాధారణ అభిమానులకు ప్రవేశం లేదు, కేవలం మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి. అయితే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ వచ్చే అవకాశాలు దాదాపుగా లేనట్టే అట. సంధ్య థియేటర్ ఘటనని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఈ ఈవెంట్ కి డుమ్మా కొట్టేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే రోజున మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ కూడా మొదలైంది. పూజా కార్యక్రమాలు గుట్టు చప్పుడు కాకుండా జరుపుకున్నారు. మీడియా కి కూడా ఎలాంటి సమాచారం అందించలేదు. సమాచారం ఇస్తే ఎక్కడ అభిమానులు వేల సంఖ్యలో లొకేషన్ కి వచ్చి చేరుకుంటారో అనే భయంతో ఇలా చేసినట్టు తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి రామ్ చరణ్, మహేష్ బాబు జాగ్రత్తలు వహించడం చూస్తుంటే, అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఇది ఇలా ఉండగా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల నాల్గవ తేదీన రాజమండ్రి లో కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి ఒకే ఈవెంట్ లో పాల్గొనబోతున్న రోజు కావడంతో అభిమానులు వేల సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటన ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ నిర్వాహకులు చాలా పకడ్బందీగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా సెక్యూరిటీ విషయం లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మెగా అభిమానులు చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.