Pawan Kalyan: N కన్వెన్షన్ కూల్చివేతపై మొదటిసారి స్పందించిన పవన్ కళ్యాణ్..నాగార్జున పై డైరెక్ట్ సెటైర్స్!

ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు స్పందించి రేవంత్ సర్కార్ ని అభినందించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేసాడు. వరద బీభత్సం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతం మొత్తం నేలమట్టం అయ్యింది.

Written By: Vicky, Updated On : September 4, 2024 5:33 pm

Pawan Kalyan(5)

Follow us on

Pawan Kalyan: చెరువుల స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాల పై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థ ద్వారా చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లోని మాధాపూర్ లో నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్ కూల్చివేయడం పెద్ద సంచలనంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది చెరువుని ఆక్రమించి కట్టిన నిర్మాణమే అని ప్రతీ ఒక్కరికి తెలుసు. కానీ గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఈ N కన్వెన్షన్ ని కూల్చేసి సంచలనం సృష్టించింది. కేవలం ఈ ఒక్క కట్టడం మాత్రమే కాదు, హైదరాబాద్ లో ఇలా చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది హైడ్రా.

దీనిపై ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు స్పందించి రేవంత్ సర్కార్ ని అభినందించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేసాడు. వరద బీభత్సం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతం మొత్తం నేలమట్టం అయ్యింది. రోడ్ల మీద బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్రం లో ప్రభుత్వం ద్వారా చేస్తున్న సహాయ సహకారాలను మీడియా కి తెలిపేందుకు నేడు ఉపముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన అనేక అంశాలపై చర్చించాడు. ఈ స్థాయి వరదలు రావడానికి ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భవనాల వల్లే, ఈరోజు ఆ చెరువులే ఉండుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురు అయ్యేవి కావు, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు, మీరు కూడా అలాంటి చర్యలు చేపట్టబోతున్నారా?, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని పవన్ కళ్యాణ్ ని ఒక విలేఖరి అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘హైడ్రా వ్యవస్థ ద్వారా అక్రమ కట్టడాలను కూల్చేయడం మంచి పరిణామమే, కానీ దీనిని మేము ఇక్కడ అమలు చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది అమాయకులు తెలియకుండా స్థలాలను కొనేసి ఉంటారు. వాళ్ళు సామాన్యులు, అలాంటి వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలి, ఆ విధంగా మేము ప్రయత్నాలు భవిష్యత్తులో చేస్తాము’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇలా పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా కి మద్దతు తెలపడంతో అక్కినేని అభిమానులు బాగా ఫీల్ అయ్యారు. మా అభిమాన హీరో కష్టసమయంలో ఎవరూ నిలబడడం లేదని సోషల్ మీడియాలో బాధపడుతూ పోస్టులు పెడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం నాగార్జున కొన్న భూమి ఇది. ఆ భూమి చెరువుకి సంబంధించినదా లేదా అనే విషయం ఆయనకు తెలియక పోవచ్చు, ఒకవేళ తెలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండుంటే మాత్రం కచ్చితంగా అది తప్పే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.