https://oktelugu.com/

Puri Jagannadh: పూరి జగన్నాధ్ కి అవకాశం ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో… పూరి ఆయన నమ్మకాన్ని నిలబెడతాడా..?

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణంగా వస్తూనే ఉంటాయి. కొంతమంది దర్శకులు ఒకసారి కొన్ని సక్సెస్ లను సాధిస్తే, ఇంకోసారి ప్లాప్ లను కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ల కంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు సైతం ఒకానొక సమయంలో వరుసగా ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 05:36 PM IST

    Puri Jagannadh

    Follow us on

    Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన తన పూర్తి ఫామ్ ను కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఇక గతం కి విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన రామ్ ను హీరోగా పెట్టి చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో మరొక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత పూరి జగన్నాథ్ కెరియర్ భారీగా డౌన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆయనకు ఏ హీరోలు కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు చేస్తున్నాను అని ఏదో ఒక వరస్ట్ కథను తీసుకొని దానిమీదనే సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది చూసే ప్రేక్షకులకు చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తుంటే పూరి జగన్నాథ్ మాత్రమే ఇంకా రొటీన్ రొట్ట ఫార్ములా లోనే ముందుకు సాగుతూ ఉండడం ప్రేక్షకులను చాలావరకు ఇబ్బంది పెడుతుంది.

    దానివల్లే ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్క హీరో కూడా భయపడిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో అయిన సల్మాన్ ఖాన్ తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి సల్మాన్ ఖాన్ కి పూరి జగన్నాథ్ మేకింగ్ అంటే చాలా ఇష్టమట. అందువల్లే పూరీ జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని తను ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వర్కౌట్ కావడం లేదు.

    ఇక పూరి జగన్నాథ్ ఒకప్పుడు చేసిన ‘గోలీమార్ ‘ సినిమాని సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అయిన పూరి జగన్నాథ్ భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక గోలీమార్ సినిమా గోపీచంద్ కెరియర్ లో ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాగా మారిపోయింది.

    పూరి జగన్నాథ్ ఎప్పుడైతే ఈ సినిమాని తెరకెక్కించాడో అప్పుడు ఆయనకి ఒక మంచి సక్సెస్ రావడమే కాకుండా మహేష్ బాబుతో ‘బిజినెస్ మెన్’ సినిమా చేయడానికి కూడా ఆ సినిమా చాలా వరకు దోహదపడింది. మరి ఇలాంటి సందర్భంలో పూరి జగన్నాథ్ ఈ సినిమాని రీమేక్ చేసి భారీ సక్సెస్ ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…