Akira Nandan
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan kalyan) సినిమాల కోసం ఎదురుచూసే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాని మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలైతే చేస్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మరోసారి వాయిదా పడే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మేనియా అంతా ఇంతా కాదు. కాబట్టి మరోసారి ఆయన సినిమాలను చూసి ఆనందపడాలనే ఉద్దేశ్యం లో తమ అభిమానులైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ (Akhira Nandan) సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ ఎప్పటికప్పుడు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అకిరానందన్ లుక్ చూసిన చాలామంది సినిమా మేధావులు సైతం ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన కటౌట్ అయితే అకిరాకీ ఉందని తొందర్లోనే తను సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి అకిరానందన్ ను తెలుగు తెరమీదకి పరిచయం చేయడానికి చాలా మంది దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారట.
ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్న అకిరానందన్ తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని తద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడో అంతకు మించిన ఇమేజ్ ను అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక పవన్ కళ్యాణ్ కూడా తనని హీరోగా మార్చాలని అనుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా అకిరా నందన్ భారీ గడ్డంతో ఒక రగ్గుడ్ లుక్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హైట్ లో కూడా భారీగా ఉండే అకిరా నందన్ బాడీని ఫిట్ చేసినట్లయితే మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో ఆరు అడుగులతో పెద్ద సినిమాలు చేయడానికి కూడా చాలా బాగా సెట్ అవుతాడు.
మరి ఇలాంటి సందర్భంలో యాక్టింగ్ లో కూడా భారీ మెలకువలను నేర్చుకుంటున్న అకిరానందన్ పేరెంట్స్ కూడా యాక్టర్స్ అవ్వడంతో అతనికి స్వతహాగా యాక్టింగ్ అనేది వచ్చిందని యాక్టింగ్ విషయంలో ఆయన పెద్దగా కష్టపడాల్సిన పని లేదంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం…ఇక ఈయనను ఇండస్ట్రీ కి పరిచయం చేయడానికి పలువురు డైరెక్టర్లు ఆసక్తిగా ఉన్నారు…