https://oktelugu.com/

Gautam Adani: గౌతమ్ అదాని గొప్ప మనసు.. పాఠశాలల నిర్మాణానికి అన్నేసి కోట్లు ఇస్తామని ప్రకటన..

ముకేశ్ అంబానీ తన హోదాను ప్రదర్శించేలాగా కుమారుడి వివాహం జరిపిస్తే.. మనదేశంలో అదే స్థాయిలో ధనవంతుడైన గౌతమ్ అదాని అత్యంత సింపుల్ గా తన కుమారుడి వివాహం జరిపించాడు.

Written By: , Updated On : February 18, 2025 / 09:03 AM IST
Gautam Adani

Gautam Adani

Follow us on

Gautam Adani: గత ఏడాది మనదేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడి పెళ్లి ఘనంగా చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం వందలాది కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధులను తన కుమారుడి వివాహానికి ఆహ్వానించాడు. కళ్ళు చెదిరిపోయే విధంగా సెట్టింగులు.. బొజ్జ నిండిపోయే విధంగా విందులు.. మనసు గాల్లో తెలిపే విధంగా వినోదాలు అందించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ముకేశ్ అంబానీ తన హోదాను ప్రదర్శించేలాగా కుమారుడి వివాహం జరిపిస్తే.. మనదేశంలో అదే స్థాయిలో ధనవంతుడైన గౌతమ్ అదాని అత్యంత సింపుల్ గా తన కుమారుడి వివాహం జరిపించాడు. అంతేకాదు ఏకంగా వేల కోట్లను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తానని ప్రకటించాడు. దానికోసం ఆ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్టు వెల్లడించాడు. గౌతమ్ అదానీ తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అతని మంచి మనసుకు ఆ నిర్ణయం అర్థం పడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానించారు.. అయితే తన కుమారుడి పెళ్లి కోసం పెద్దగా ఖర్చు చేయకుండా.. సమాజ హితానికి వేలకోట్లు మంజూరు చేసిన గౌతం ఆదాని.. ఇప్పుడు మరో మంచి పని చేశారు.. ఏకంగా 2000 కోట్లు కేటాయించి సంచలనం సృష్టించారు..

దేనికోసం అన్ని కోట్లు అంటే

గౌతమ్ అదాని చిన్నప్పుడు చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. వ్యాపారంలో మెలకువలు సాధించారు. చివరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. నష్టాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. పైగా తన మీద తానే ప్రయోగాలు చేసుకోవడం మొదలుపెట్టారు. చివరికి ప్రపంచం మెచ్చే వ్యాపారవేత్తగా ఎదిగారు. అయితే ఇందులో ఎన్ని రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదా అని వెనుకడుగు వేయలేదు. పైగా భిన్నమైన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి ముందడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా 20 స్కూలు నిర్మించేందుకు 2000 కోట్లు ఇస్తామని గౌతమ్ ఆదాని గ్రూప్ వెల్లడించింది. ప్రైవేట్ K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడర్ గా ఉన్న GEMS ఎడ్యుకేషన్ సంస్థలు దీనికి భాగస్వామిగా ఎంచుకున్నామని గౌతమ్ అదాని వెల్లడించారు. తన చిన్న కుమారుడు జీత్ వివాహం సందర్భంగా గౌతమ్ అదాని పదివేల కోట్ల రూపాయలను సమాజ హిత కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించారు. అందులో 6000 కోట్లను ఆస్పత్రిలో నిర్మాణం.. 2000 కోట్లను స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించారు. ఇక మిగతా 2000 కోట్లను స్కూళ్ల నిర్మాణానికి వినియోగిస్తామని గౌతమ్ ఆదాని వెల్లడించారు. “గౌతమ్ ఆదానిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయన చదువుకు విలువ ఇస్తారు. చదువుకోవడాన్ని ప్రోత్సహిస్తారు. చదువు విలువ ఆయనకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్లే ఆయన రెండు వేల కోట్ల వరకు కేటాయించారు. దేశంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా తీసుకుంటారో లేదో తెలియదు.. మొత్తానికైతే 2000 కోట్లు కేటాయించి గౌతమ్ అదాని ఒక్కసారిగా సంచలన వ్యక్తిగా మారిపోయారని” ఆదాని గ్రూపు సంస్థల ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.