Ali Daughter Marriage Pawan Kalyan : సుమారు నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతూ చైల్డ్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా మరియు హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు అలీ..ఇండస్ట్రీ లో కమెడియన్ గా అలీకి ఉన్న బ్రాండ్ ఇమేజి వేరు..గవర్నమెంట్ ఇండస్ట్రీ కి అతను చేస్తున్న సేవలను, మరియు బయట ఆయన చేస్తున్న సామాజిక సేవను గుర్తించి డాక్టరేటుతో కూడా అతనిని సత్కరించింది..అలాంటి అలీ నిన్న తన కూతురు ఫాతిమా వివాహం ని నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఈ వివాహ మోహోత్సవానికి ఇండస్ట్రీ లో అలీతో కలిసి పనిచేసిన హీరోలు, కమెడియన్లు మరియు క్యారక్టర్ ఆర్టిస్టులందరు హాజరయ్యారు..మెగా స్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , అల్లు అరవింద్, శ్రీకాంత్ , అల్లరి నరేష్ , బ్రహ్మానందం , త్రివిక్రమ్ శ్రీనివాస్ , నాని ఇలా అందరూ పెళ్లి కి హాజరై వధూవరులను ఆశీర్వదించారు..కానీ అలీ కి ఎంతో ఆప్తమిత్రుడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పెళ్ళికి హాజరు కాలేదు.
పవన్ కళ్యాణ్ మరియు అలీ ఎంత మంచి స్నేహితులనే విషయం మన అందరికి తెలిసిందే..తొలి సినిమా నుండి కాటమరాయుడు సినిమా వరుకు అలీ లేకపోతే అసలు సినిమానే చేసేవాడు కాదు పవన్ కళ్యాణ్..అలాంటి స్నేహబంధం ఉన్న వీళ్లిద్దరి మధ్య రాజకీయం ఇంత దూరం పెంచుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు..అలీ కి పవన్ కళ్యాణ్ తో మళ్ళీ కలిసిపోవాలి..అతనితో కలిసి నటించాలనే కోరికని పలు సందర్భాలలో బయటపెట్టినా, పవన్ కళ్యాణ్ మాత్రం అలీ తో కలవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది..అలీ తన కూతురు పెళ్ళికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేదట.

అందుకే నిన్న జరిగిన అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట..దీనితో భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలుస్తారు..కలిస్తే చూడాలి అని అనుకున్న ఫ్యాన్స్ ఇక జీవితంలో వీళ్ళు మళ్ళీ కలవరు అనే నిర్ధారణకు వచ్చేసారు ఫాన్స్..ఒక్క రాజకీయం ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఈ స్థాయి దూరం పెంచుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ
— Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022