Pawan Kalyan Vs Samantha : చాలా కాలం తర్వాత సమంత(Samantha Ruth Prabhu) ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని అనుకుంటుంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసి, తన ఆలోచనలకు, అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. విజయవంతంగా అప్పుడే ఆమె ‘శుభమ్'(Subham Movie) అనే చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కొత్త వాళ్ళే. హీరోకి ఒక రెమ్యూనరేషన్, హీరోయిన్ కి ఇంకో రెమ్యూనరేషన్ అనే బేధభావాలు లేకుండా, సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి సమానమైన రెమ్యూనరేషన్ ని ఇచ్చి, నిర్మాతగా సరికొత్త ట్రెండ్ ని నాంది పలికింది సమంత. రీసెంట్ గానే టీజర్ ని విడుదల చేసిన ఆమె, నేడు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది.
Also Read : రకుల్ ప్రీత్ సింగ్ టార్చర్ తట్టుకోలేక నాగార్జున అలాంటి పని చేశాడా!
మే9 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేసింది. మే9 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సమంత అదే తేదీన తన చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమవ్వడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. మీడియా లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం మే9 రాదని ఒక ప్రచారం బలంగా జరుగుతుంది. ఆ విషయం సమంత కి కూడా తెలుసు కాబట్టే ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా?, లేకపోతే తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిన అంశం. ఒకవేళ ‘హరి హర వీరమల్లు’ చిత్రం అదే రోజున విడుదల అయినా పర్వాలేదు అనే ధోరణితో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ చూపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ అంటే సమంత కి ఎంతో ఇష్టమని గతం లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనమంతా చూసాము. ఒకప్పుడు అయితే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే సెలబ్రిటీస్ లో సమంత ఉండేది. కానీ గత మూడేళ్ళ నుండి ఆమె పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. అంతే కాకుండా ఇండస్ట్రీ లో అందరి హీరోలను ఇన్ స్టాగ్రామ్ లో అనుసరిస్తున్న సమంత, పవన్ కళ్యాణ్ ని మాత్రం అనుసరించడం లేదు. ఎన్నికలలో సంచలన విజయం సాధించినప్పుడు, సినీ సెలబ్రిటీలంతా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పగా, సమంత మాత్రం మౌనం వహించింది. దీనిని బట్టి చూస్తే సమంతకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం తీసుకోవడం నచ్చినట్టు లేదని సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తుంది.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానులకు కి ఒక శుభవార్త..ఒక చేదు వార్త!