Veera Dheera Soora 2 : చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కి రీసెంట్ గా విడుదలైన ‘వీర ధీర శూర'(Veera Dheera Sooran 2) చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు. మొదటి రోజు ఆర్ధిక లావాదేవీల కారణంగా నిర్మాతల మధ్య గొడవలు రావడంతో మార్నింగ్ షోస్, మ్యాట్నీ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. సాయంత్రం షోస్ నుండి ఈ సినిమా ప్రదర్శన మొదలైంది. మొదటి రోజు కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ టాక్ చాలా పాజిటివ్ గా ఉండడంతో రెండవ రోజు నుండి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. అలా డీసెంట్ స్థాయి లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Also Read : పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరిన సమంత..ఇంత ధైర్యమా..మండిపడుతున్న ఫ్యాన్స్!
రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ ఎక్కడా?, 68 కోట్ల రూపాయిల క్లోజింగ్ కలెక్షన్స్ ఎక్కడా?, సరైన కంటెంట్ తీస్తే ఆడియన్స్ ఆదరించకుండా ఉండరు అనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమి కావాలి?. గత ఏడాది విక్రమ్ ‘తంగలాన్’ చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమాకి, ‘వీర ధీర శూర’ రేంజ్ టాక్ వచ్చి ఉండుంటే కచ్చితంగా విక్రమ్ ఖాతాలో 300 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా ఉండేది. అంతా ఆయన దురదృష్టం అనుకోవాలి. థియేటర్స్ లో దిగ్విజయంగా రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్, అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నెల 24 వ తేదీ నుండి ఈ చిత్రం అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వనుంది.
కాసేపటి క్రితమే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడండి. విక్రమ్ అద్భుతమైన నటన తో పాటు, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు సరికొత అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి, కచ్చితంగా ప్రీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తామని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ప్రీక్వెల్ అంటే హీరో ఫ్లాష్ బ్యాక్ మీద స్టోరీ అన్నమాట. ఒకప్పుడు ఊర మాస్ రౌడీ గా ఉండే హీరో, ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయాడు అనేది ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు. విక్రమ్ నటన మెయిన్ హైలైట్ అయితే, SJ సూర్య నటన మరో హైలైట్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం విడుదల లేకుంటే కచ్చితంగా ఈ సినిమాకి ఇంకా మంచి గ్రాస్ వసూళ్లు వచ్చేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : సుమ ని అక్కా అని పిల్చిన రాజీవ్ కనకాల.. వీడియో వైరల్!