Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని క్రేజ్ అతనికి దక్కింది. అలాంటి నటుడు ప్రస్తుతం అటు రాజకీయ రంగంలో రాణిస్తూనే సినిమా ఇండస్ట్రీలో సైతం ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం చేసిన ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈనెల 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు…
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
ఈ సినిమాతో ఎలాగైనా సరే తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు అంటే వైసిపి పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలుగా తెలుస్తుంది.
వైసీపీ కీలక నేతలు కావాలనే ఈ సినిమా మీద నెగెటివ్ ప్రచారాన్ని చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా మొత్తంలో పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతూ వాళ్ళు చాలా నెగెటివ్ వార్తలైతే రాస్తున్నారు. ఇక దానికి తోడుగా సినిమా మీద కూడా నెగెటివ్ కామెంట్లు చేయడం అభిమానులను కలవరపరుస్తుంది…
ఇక ఈ సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ ని సాధిస్తే వరుసగా సక్సెస్ లను సాధించిన హీరోగా నిలుస్తాడు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలేవి కూడా వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం వరుసగా రెండు సినిమాలతో సక్సెస్ ను సాధించిన రికార్డు అందుకుంటాడు. అలాగే ఆయన అభిమానులను ఆనంద పరిచినవాడవుతాడు…