Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: నేడు జరగబోయే T20 ఫైనల్ మ్యాచ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్'...

Ustaad Bhagat Singh: నేడు జరగబోయే T20 ఫైనల్ మ్యాచ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్నటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. ఈ నెల 10 లేదా 11 న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతుండగా, మేకర్స్ నిన్న ఆ ట్రైలర్ కి […]

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్నటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. ఈ నెల 10 లేదా 11 న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతుండగా, మేకర్స్ నిన్న ఆ ట్రైలర్ కి సంబంధించిన చిన్న ప్రోమో ని విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఎంత మాస్ గా చూడాలని కోరుకుంటారో, అంతకంటే ఎక్కువ మాస్ గా ఈ చిత్రం లో చూపించినట్టు ఈ ప్రోమో ని చూస్తేనే తెలుస్తోంది. ఓజీ తో డైరెక్టర్ సుజిత్ జెన్ జీ ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ ని బాగా దగ్గర చేస్తే , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని మరోసారి మాస్ ఆడియన్స్ బాగా దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

40 సెకండ్ల వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే, ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో, పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం ఓపెనింగ్స్ లో ఈ చిత్రం సునామీని సృష్టిస్తుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్న విడుదల చేసిన ప్రోమో వీడియో ని నేడు జియో హాట్ స్టార్ లో ప్రసారం అవ్వబోయే , ఇండియా వెర్సస్ న్యూజిల్యాండ్ T20 ఫైనల్ మ్యాచ్ స్ట్రీమింగ్ మధ్యలో వచ్చే బ్రేక్స్ లో ప్రదరిశిస్తారని తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు , ఎన్ని సార్లు బ్రేక్ వస్తుందో, అన్ని సార్లు ఈ సినిమా ప్రోమో టెలికాస్ట్ అవుతుందట. ఇది నిజంగా సినిమాకు చాలా పెద్ద పబ్లిసిటీ స్ట్రాటజీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే నేడు జియో స్టార్ లో దేశవ్యాప్తంగా ఈరోజు జరగబోయే మ్యాచ్ ని కోట్ల మంది వీక్షిస్తారు. అలాంటి మ్యాచ్ సమయం లో ఈ ప్రోమో రావడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు రాత్రి నుండి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గ్రాండ్ గా మొదలు కాబోతున్నాయి. సరైన సమయానికి , ఈ ప్రోమో అందరికీ చేరబోతోంది. ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఆరంభం లో ఎలా ఉండబోతుందో చూడాలి. మార్చి 19 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓజీ లాంటి హిట్ తర్వాత పవన్ నుండి వస్తున్న ఈ సినిమా ఓజీ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper