Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ మీటింగ్స్ ఇటు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటన్నిటికీ ఆయన షార్ట్ బ్రేక్ ఇచ్చారు. సతీసమేతంగా ఇటలీకి పయనమయ్యారు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళుతున్నారు. నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్ లో లావణ్య-వరుణ్ లకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. వరుణ్ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. రామ్ చరణ్ కొద్దిరోజుల క్రితం ఉపాసన, కూతురు క్లిన్ కారతో ఇటలీ వెళ్లారు. రామ్ చరణ్ దంపతులు అక్కడే ఉన్నారు. వరుణ్-లావణ్య నిన్న ఇటలీకి పయనమయ్యారు. మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఇటలీ దేశం వెళుతున్నారు.
నేడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తో పాటు ఇటలీ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. మీడియా పవన్ దంపతులను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా కాలం అనంతరం పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా జంటగా కనిపించారు. పవన్ కళ్యాణ్ దాదాపు వారం రోజులు ఇటలీలో ఉండే సూచనలు కలవు.
తిరిగి వచ్చిన వెంటనే ఆయన పొలిటికల్ గా బిజీ కానున్నారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే సూచనలు కలవు. ఇక ఓజీ పీరియాడిక్ ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.