Bhagavanth Kesari Collection: భగవంత్ కేసరి చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలన్న కలకు బాలయ్య కొంత దూరంలో ఆగిపోయారు. ఆయన చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో పోల్చుకుంటే భగవంత్ కేసరి ఇంకా హిట్ స్టేటస్ అందుకోలేదు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదలైంది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన లియో, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. భగవంత్ కేసరి ఆ రెండు చిత్రాల కంటే బెటర్ టాక్ తెచ్చుకుంది. ఇది వసూళ్ళలో కనిపించింది.
ఫస్ట్ వీక్ వరకు భగవంత్ కేసరి మంచి వసూళ్లు రాబట్టింది. రెండో వారం మొదలయ్యాక వీక్ అయ్యింది. భగవంత్ కేసరి 9వ రోజు శుక్రవారం ఏపీ/తెలంగాణాలలో రూ. 1 కోటి షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ రూ. 1.48 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా భగవంత్ కేసరి రూ. 58 కోట్ల వైల్డ్ వైల్డ్ షేర్ అందుకుంది.
భగవంత్ కేసరి హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. నైజాంలో రూ. 14.5 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, UA రూ. 8 కోట్లకు అమ్మారు. రెస్టాఫ్ ఇండియా రూ.4.25 కోట్లకు, ఓవర్సీస్ రూ. 6 కోట్లు పలికాయి. వరల్డ్ వైడ్ రూ. 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.69 కోట్లు. అంటే మరో 11 కోట్లు వస్తే కానీ భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ కాదు.
ఈ వీకెండ్ కూడా భగవంత్ కేసరిదే. పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. శని, ఆదివారాల్లో మరో రెండు మూడు కోట్ల షేర్ భగవంత్ కేసరి వసూలు చేసే ఆస్కారం కలదు. రూ. 11 కోట్లు వసూలు చేయడం మాత్రం అసాధ్యం. దాదాపు భగవంత్ కేసరి ప్లాప్ మూవీగా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు భారీగా లాభపడ్డారు.
భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ నటించింది. కీలక రోల్ లో శ్రీలీల నటించింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సైన్ స్క్రీన్స్ పతాకం పై తెరకెక్కింది. థమన్ సంగీతం అందించాడు.