Pawan Kalyan Production: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పదేళ్ల క్రితం ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'(Pawan Kalyan Creative Works) అనే నిర్మాణ సంస్థని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ పై ఇప్పటి వరకు ఆయన కేవలం రెండు సినిమాలనే నిర్మించాడు. ఒకటే ఆయనే హీరో గా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మరొకటి నితిన్ హీరో గా నటించిన ‘చల్ మోహన రంగ’. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ని ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మొదలు పెట్టాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఎందుకో ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని బండ్ల గణేష్ నిర్మాణం లో తెరకెక్కించారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ పదేళ్ల నుండి ఖాళీగానే ఉంటుంది.
అయితే ఈ సంస్థ ని పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్టీవ్ చేయడానికి సిద్దమయ్యాడు. త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది. అంతే కాకుండా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగం కాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతాడు అని చెప్పొచ్చు. కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, ఇక మీదట త్రివిక్రమ్ దర్శకత్వం వహించే ప్రతీ సినిమాకు పవన్ కళ్యాణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఒక రాజకీయ పార్టీ ని నడుపుతున్న అధినేత గా పవన్ కళ్యాణ్ కి డబ్బులు భారీగా ఉండడం అత్యవసరం.
ఎందుకంటే ప్రతీ ఐదేళ్లకు ఎన్నికలు చాలా ఖరీదు అయిపోతున్నాయి. డబ్బు లేకుండా రాజకీయం చేయడం అనేది అసాధ్యమని పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకున్నాడు. అందుకే 2029 వ సంవత్సరం కి గానూ ఆర్థికంగా బాగా సెట్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. హీరో గా పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు ఇప్పుడు వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న మూడు సినిమాలు విడుదల అయ్యాక, త్వరలోనే మరో కొత్త పాన్ ఇండియన్ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న తెలియజేయనున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అటు సినిమాలను ఇటు రాజకీయాలను ఎలా బ్యాలన్స్ చేస్తాడు అనేది.