NTR director: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే లభిస్తోంది. మన దర్శకులు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు… అలాగే రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ లను సాధిస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఢీకొట్టే వారు మరెవరు ఉండరు అనేది వాస్తవం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు చాలా గొప్ప సినిమాలను చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం మంచి సినిమాలు చేసి గొప్ప గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఒక్క సినిమాతో డిజాస్టర్ ని అందుకోవడంతో ఇండస్ట్రీ లో కనబడకుండా పోయాడు. ప్రస్తుతం ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఆయన చేసిన సినిమాలు ఏంటి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…
Read Also: పాన్ ఇండియన్ హీరో చిత్రానికి నిర్మాతగా పవన్ కళ్యాణ్..డైరెక్టర్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!
‘అతనొక్కడే’ (Athanokkade) సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సురేందర్ రెడ్డి (Surendar Reddy) ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఆ తర్వాత కిక్, ఊసరవెల్లి, రేసుగుర్ర, ధృవ లాంటి సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన అఖిల్ (Akhil) తో చేసిన ఏజెంట్ (Agent) సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇండస్ట్రీలో అసలు ఆయన పేరు వినిపించకుండా పోయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది కీలకంగా మారింది. గతంలో ఆయనకు పవన్ కళ్యాణ్ అవకాశాన్ని ఇచ్చాడు అంటూ వార్తలైతే వచ్చాయి.
కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా మారిపోవడంతో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి సినిమాలు చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం సురేందర్ రెడ్డి హీరోల కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయనకు అవకాశం ఇచ్చే హీరోలు ఎవరు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
Read Also: విజయ్ దేవరకొండ డూ ఆర్ డై సిచువేషన్ లో ఉన్నాడా..?
ఇక ఏది ఏమైనా కూడా సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఇలాంటి డిజాస్టర్లు వచ్చినట్లయితే ఆయన మొత్తానికే తన మార్కెట్ ను కోల్పోయి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన అవసరమైతే రావచ్చు.
కెరియర్ మొదట్లో మంచి సినిమాలు చేసి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… కానీ ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు అతన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ లిస్టులో ఉన్న సురేందర్ రెడ్డి ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం పట్ల అతని అభిమానులు సైతం తీవ్రంగా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…