సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన పేరు చెబితే చాలు ఊగిపోయే అభిమానులున్నారు. ఇక ఆయన నటిస్తే అంతే. సినిమా బ్లాక్ బస్టరే. తనదైన శైలిలో నటనలో వైవిధ్యం చూపెడుతూ నిత్యం అభిమానుల గుండెల్ని పిండేసే పవన్ కల్యాణ్ సినిమా అంటే అందరికి పండుగే. వెండితెరపై ఎప్పుడు చూద్దామని వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ తో ప్రేక్షకులను కనువిందు చేశారు. తన నటనతో మెప్పించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.
వకీల్ సాబ్ మొదటి ఆట నుంచే మంచి రికార్డులు అందుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాలను లైన్ లో పెట్టుకున్నారు. ఎప్పుడు కొత్తదనం కోసం చూసే పవన్ కల్యాణ్ ఈ సారి కూడా హిట్ కొట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి సారి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే యంగ్ హీరో రానాతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు అంగీకరించారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పమమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు చిన్న వీడియోను విడుదల చేశారు. అలా మొదలు పెట్టారో లేదో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా వేవ్ తగ్గడంతో షూటింగ్ మళ్లీ ప్రారంభించారు. నేటి నుంచి సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ స్పాట్ లో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీస్ గెటప్ లో పవన్ కల్యాణ్ అదరగొడుతున్నారుు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది.