ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. రోజురోజు గండంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్పు పుట్టడమే కష్టంగా అయిపోయింది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్న ఏపీకి కేంద్రం ఝలక్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఇతర మార్గాలకు మళ్లించకుండా ప్లాన్ వేసింది. వీటికి రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే వాటాను సకాలంలో చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. పీడీ ఖాతాలకు నిధులు మళ్లించకుండా మరింత కట్టుదిట్టం చేస్తోంది. దేశంలో ఒక్కో రాష్ర్టం ప్రజలకు లబ్ధిచేకూర్చే విధంగా […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 3:03 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. రోజురోజు గండంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్పు పుట్టడమే కష్టంగా అయిపోయింది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్న ఏపీకి కేంద్రం ఝలక్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఇతర మార్గాలకు మళ్లించకుండా ప్లాన్ వేసింది. వీటికి రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే వాటాను సకాలంలో చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. పీడీ ఖాతాలకు నిధులు మళ్లించకుండా మరింత కట్టుదిట్టం చేస్తోంది.

దేశంలో ఒక్కో రాష్ర్టం ప్రజలకు లబ్ధిచేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటుంది. కేంద్రం కూడా వీటికి కొన్ని ప్రత్యేక పథకాలను రూపొందించుకుంటుంది. కొన్ని నేరుగా పూర్తిస్థాయిలో నిధులు వచ్చేవి అయితే మరికొన్ని రాష్ర్ట ప్రభుత్వం వాటా కలుపుకుని అమలు చేస్తాయి. రాష్ర్టం తనవాటా ఇస్తేనే పథకం అమలు జరుగుతుంది. లేకపోతే నిధులిచ్చే పథకాలు స్టేట్లలో అమలు కావడం లేదు. దీనికి కారణం వాటికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని స్టేట్లు తమ సొంత పథకాలకు మళ్లించుకుంటాయి.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నసంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్ర నిధులు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పలు స్టేట్లలో పథకాలు అమలు కావడం లేదు. దీంతో రాష్ర్ట ప్రభుత్వాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం పక్కాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ర్ట ప్రభుత్వాల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది.

కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ఇచ్చే నిధులు ఆర్బీఐలోని రాష్ర్ట ప్రభుత్వాల ఖాతాలకు చేరుతాయి. తరువాత వాటిని రాష్ర్ట ప్రభుత్వాలు నోడల్ ఏజెన్సీలకు బదిలీ చేస్తాయి. కేంద్రం విడుదల చేసిన 40 రోజుల్లోపు స్టేట్లు కడా తమ వాటా విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో నిధులు ఎక్కడ మళ్లింపు జరిగినా కేంద్రం చర్యలు తీసుకోవడం ఖాయం.

కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలు ఏపీకి ప్రతిబంధకంగా మారాయి. సొంత రాబడి లేక ఇబ్బందులు పడుతున్న ఏపీకి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కష్టాల్లో పడింది. రాష్ర్ట ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కేంద్రం ఆదేశాలు శరాఘాతంగా మారాయి. కేంద్రం విడుదల చేస్తున్న తాజా మార్గదర్శకాల ప్రకారం ఏపీ మరింత దివాళా తీయడం ఖాయమే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.