Pawan Kalyan : ఈమధ్య కాలం లో కుర్ర హీరోలంతా పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ సినిమాల టైటిల్స్ ని తెగ వాడేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వాడితే వాడారు, ఆ టైటిల్స్ పరువుని తీసేస్తున్నారు. ఒక్కరు కూడా ఆ టైటిల్స్ తో హిట్స్ కొట్టలేకపోతున్నారు. విజయ్ దేవరకొండ ‘ఖుషి'(Kushi Movie) నుండి ఈ ట్రెండ్ మొదలైంది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో , టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పిన చిత్రమిది. రీ రిలీజ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. అలాంటి సినిమా టైటిల్ ని విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన సినిమాకు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన వ్యక్తిరేకత ఎదురైంది. కానీ ఆ సినిమాలోని పాటలు పెద్ద హిట్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. మన సినిమా టైటిల్ పరువు తియ్యదు లే అని అనుకున్నారు.
కానీ ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో ఆగిపోతుందని అనుకుంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం హిట్ గా నిల్చిన ‘తమ్ముడు'(Thammudu Movie) మూవీ టైటిల్ ని నితిన్ తన కొత్త సినిమాకు పెట్టుకున్నాడు. నితిన్(Actor Nithin) పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి పర్లేదు లే మనోడే కదా పెట్టుకుంటే పెట్టుకున్నాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram), నిర్మాత దిల్ రాజు(Dil Raju) కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి, అందరూ కలిసి టైటిల్ కి న్యాయం చేస్తారాని ఆశించారు. నేడే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంత చేసుకున్న ఈ చిత్రం,కనీసం ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు.
ఈ సినిమా కాకుండా ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ కూడా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అంమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ టైటిల్ తో ఈమధ్యనే మన ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమా టైటిల్ ని పెట్టుకొని సక్సెస్ ని అందుకున్నది కేవలం వరుణ్ తేజ్ మాత్రమే. 2017 వ సంవత్సరం లో వెంకీ అట్లూరి ఇతన్ని హీరో గా పెట్టి ‘తొలిప్రేమ’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. కానీ రీసెంట్ గా మాత్రం ఇవి వర్కౌట్ అవ్వడం లేదు. అనవసరంగా ఆ టైటిల్స్ యొక్క బ్రాండ్ విలువని తీసేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.