Pawan Kalyan Tholi Prema Re-release Collections: రీ రిలీజ్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘తొలిప్రేమ'(Tholiprema ReRelease) చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేటి తరం యూత్ కి ఈ సినిమా కేవలం రెండు సార్లు రీ రిలీజ్ అయ్యినట్టు మాత్రమే తెలుసు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత నుండి ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయ్యింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దిల్ రాజు ఈ చిత్రం నైజాం రైట్స్ ని అప్పట్లో కొనుగోలు చేసి కుబేరుడు అయిపోయాడు అంటే అతిశయోక్తి కాదేమో. అనేక ఇంటర్వ్యూస్ లో ఆయన ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చాడు. అప్పట్లో నాకు డబ్బులు అవసరమైనప్పుడల్లా తొలిప్రేమ సినిమాని రీ రిలీజ్ చేసుకునేవాడిని, నేను నిర్మించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయితే తొలిప్రేమ రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బులు నా నష్టాన్ని పూడ్చేవి అని చెప్పుకొచ్చాడు.
2023 వ సంవత్సరం లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో అభిమానులు సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ చిత్రానికి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2023 వ సంవత్సరం వరకు 7 సార్లు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే , 7 సార్లకు కలిపి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందట. రీ రిలీజ్ హిస్టరీ లోనే ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అనొచ్చు. ఇక 8వ సారి రీసెంట్ గానే విడుదల చేశారు. సమయం, సందర్భం ఏమి లేకపోయినా,కొత్త సినిమాలు విడుదలకు దగ్గర్లో లేకపోవడం తో, థియేటర్స్ ఫీడింగ్ కోసం విడుదల చేసినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా మొదటి రోజు 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గా కొంతమంది స్టార్ హీరోల పుట్టినరోజు కి కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: Dhanush And Pawan Kalyan: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను – ధనుష్
ఎన్నిసార్లు రీ రిలీజ్ చేసినా చెక్కు చెదరని ఆదరణ చూపిస్తున్న ఈ చిత్రాన్ని, పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా, ఖుషి మరియు గబ్బర్ సింగ్ తరహా లో ఫ్యాన్స్ ద్వారా విడుదల చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం వండర్స్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి బద్రి చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. వచ్చే ఏడాది కచ్చితంగా ‘తొలిప్రేమ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా పూర్తి స్థాయి కెపాసిటీ ఏమిటి అనేది. ఇకపోతే తొలిప్రేమ రీసెంట్ రీ రిలీజ్ కి రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయిలో గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
Powerstar Roars Again!
Tholiprema collects a solid ₹70Lakhs with a limited release!
This isn’t just nostalgia, it’s the Box Office Stamina of Powerstar proving itself once again.
Even decades later, the Tholiprema wave hits hard! ❤️@PawanKalyan #TholiPrema4K pic.twitter.com/HZVqP4BkyJ
— Tholi Prema Movie (@TholiPremaMovie) June 15, 2025