Kubera Movie Trailer Facts: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న శేఖర్ కమ్ముల(Shekar Kammula) ‘కుబేర'(Kubera Movie) మూవీ థియేట్రికల్ ట్రైలర్ నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఫ్రేమ్ లో శేఖర్ కమ్ముల మార్క్ కనపడింది. ఆయన వింటేజ్ మూవీస్ లో ఎలాంటి ఎమోషన్స్ ఉండేవో, అలాంటి ఎలివేషన్స్ అన్నీ ఈ చిత్రం లో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ ని చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుంది. ముందుగా నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మొత్తం అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్((Dhanush), రష్మిక మందన(Rashmika Mandana) చుట్టూ తిరుగుతుందని ఈ సినిమాని ప్రకటించిన రోజే మనకు అర్థమైంది. అక్కినేని నాగార్జున తన కెరీర్ లోనే ఇప్పటి వరకు చేయని క్యారక్టర్ చేసినట్టు అనిపిస్తుంది.
Also Read: ఏకంగా 8 సార్లు రీ రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’.. 8వ సారి ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే!
ట్రైలర్ ని బట్టీ ఆయన క్యారక్టర్ ఎలా ఉండబోతుందో ఒక అంచనా వేయొచ్చు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ కి తన కుటుంబం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఈ దేశం లో ఒక మనిషి పైకి ఎదగాలంటే డబ్బు, పవర్ మాత్రమే పని చేస్తాయి, నీతి నిజాయితీ కాదు అని బలంగా నమ్మే వ్యక్తి నాగార్జున. ఆ దారిలో వెళ్లడం వల్ల ఆయన ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు, చివరికి ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ధనుష్ క్యారెక్టర్ విషయానికి వస్తే మొదటి నుండి ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి లాంటిది. ఏ పాపం తెలియని ఒక కుర్రాడు,తన జీవితం లో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణం గా చిన్నతనం లోనే ఒక బెగ్గింగ్ మాఫియా లీడర్ కి దొరికి, ప్రతీ రోజు బిచ్చం ఎత్తుకుంటూ బ్రతికే ఒక సాధారణ మనిషి గా ఇందులో ధనుష్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
అలాంటి మనిషి జీవితం లోకి నాగార్జున వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇతని కోసం దేశం లోని మిలినీయర్స్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అంతలా ఇతను ఏమి చేసాడు అనేది మరో 5 రోజుల్లో వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక రష్మిక క్యారక్టర్ కూడా చాలా కొత్తగా ఉండేట్టు ఉంది. రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాకుండా,ఆమె ఇందులో ఒక మంచి క్యారక్టర్ రోల్ చేసినట్టు అనిపిస్తుంది. అనుకోకుండా ధనుష్ ఈమెకి పరిచయం అవ్వడం, ఈమె ఎక్కడికి వెళ్తే అతను అక్కడికి రావడం, ఇతని కారణంగా ఆమె కూడా సమస్యల్లో చిక్కుకోవడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించాడు. ఇంతకీ ధనుష్ ఎందుకు ఈమె వెంట పడ్డాడు?, అసలు ఏమి జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ ని చూసిన కొందరు ఒక కొరియన్ వెబ్ సిరీస్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టు చెప్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.