Pawan Kalyan Telangana Visit: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టీవ్ గా ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకపక్క పాలన పరంగా తనదైన మార్కు తో ముందుకు వెళ్తూ , మరోపక్క జనసేన పార్టీ ని బలోపేతం చెయ్యడానికి అన్ని విధాలుగా ప్లానింగ్ చేస్తున్నాడు. జనసేన పార్టీ ని కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే పరిమితం చేయకుండా, తెలంగాణ ప్రాంతానికి కూడా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన అలజడి ఎలాంటిదో కళ్లారా చూసాము. కావాలని ఆయన్ని టార్గెట్ చేస్తూ , కాంగ్రెస్ పార్టీ జనసేన క్యాడర్ ని , జనసేన నాయకులను తెలంగాణ వ్యాప్తంగా యాక్టీవ్ అయ్యేలా చేసింది. ఒకపక్క తెలంగాణ పై తన ఫోకస్ ప్రస్తుతానికి లేదని పవన్ కళ్యాణ్ చెప్తూనే , మరోపక్క అక్కడ ఆ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాడు.
అందులో భాగంగా ఈ నెల 19 న ఆయన తెలంగాణ లో జనసేన పార్టీ పీకార్యాలయాన్ని గ్రాండ్ గా ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఏ ప్రాంతం లో ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాడు అనేది ప్రస్తుతానికి తెలియదు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం తెలంగాణ మీద ఆసక్తి లేకపోయినప్పటికీ,జనసేన పార్టీ క్యాడర్ మాత్రం ఒప్పుకోవడం లేదు , ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ లో జనసేన పార్టీ ని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాల్సిందే అని పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే వాళ్ళ కోసం ఆయన ఇకపై తెలంగాణ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చూస్తుంటే , రాబోయే రోజుల్లో ఆయన అధికార కాంగ్రెస్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

