Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Surender Reddy Film Updates: పాకిస్థాన్ హీరోయిన్ అవుట్ ..చివరికి పవన్ కళ్యాణ్,సురేందర్...

Pawan Kalyan Surender Reddy Film Updates: పాకిస్థాన్ హీరోయిన్ అవుట్ ..చివరికి పవన్ కళ్యాణ్,సురేందర్ రెడ్డి మూవీకి ఆ హీరోయిన్ ఫిక్స్!

Pawan Kalyan Surender Reddy Film Updates: ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా మార్చి నెల లో ఉగాది రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం పాకిస్తానీ అమ్మాయి ఇమాన్వి ని ఎంచుకున్నట్టు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో చర్చలు నడిచాయి. ఈమె ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

ఎందుకంటే ఇమాన్వి పాకిస్థాన్ అమ్మాయి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఒక పాకిస్థాన్ అమ్మాయి తో కలిసి సినిమా చేస్తే దేశం మొత్తం ట్రోల్ చేస్తారంటూ అభిమానులు మేకర్స్ ని ట్యాగ్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మేకర్స్ చూసారో ఏమో తెలియదు కానీ, ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం మరో అమ్మాయిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, ‘ఏజెంట్’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య. ‘ఏజెంట్’ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమానే. ఇది కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ‘నారీ నారే నడుమ మురారి’ మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇదే సక్సెస్ సెంటిమెంట్ ని పవన్ సినిమాతో కూడా కొనసాగిస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేశారు.

వాస్తవానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో రాశీ ఖన్నా కి బదులుగా సాక్షి వైద్య నే ఎంచుకున్నారట. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం, సాక్షి వేరే మూవీ తో బిజీ అవ్వడం వల్ల ఈ చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట మేకర్స్. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మరోసారి పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం సాక్షి వైద్య పేరు ఇండస్ట్రీ లో మారుమోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఆమె అదృష్టం ఎలా ఉంది అనేది. చూసేందుకు చాలా చక్కగా ఉంటుంది, కానీ అందానికి తగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. ఈ సినిమా నుండి ఆమె తల రాత మారొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version