Directors Facing Trolling: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కొన్ని సంవత్సరాలు పాటు ఎదురుచూసిన హీరోలున్నారు. ఒక సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ను వాడుకొని మంచి సినిమాలు చేసి టాప్ పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారు. కానీ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఇండస్ట్రీ హిట్ల ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాతో సక్సెస్ వస్తే ఆ సినిమాతో భారీ ఆఫర్లు అందుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు దర్శకులు మాత్రం వాళ్ళు చేసిన సినిమాలతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాళ్ళను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి సినిమాలు చేసిన మెహర్ రమేష్ ను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన 5 సినిమాల్లో 5 సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ గా సాధించకలేకపోయాయి… ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమా ఒకటి కొంచెం పర్లేదు అనిపించుకున్నప్పటికి మిగిలిన సినిమాలన్ని డిజాస్టర్లు గా మారిపోయాయి…
దాంతో మెహర్ రమేష్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మెహర్ రమేష్ ను ఉద్దేశిస్తూ మరో సినిమా చేయకండి అని చెబుతున్నారు. ఎందుకంటే తన వల్ల స్టార్ హీరోలకు భారీగా ఫ్లాప్ లైతే వస్తున్నాయంటూ అందుకే మీరు సినిమా చేయకుండా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా మెహర్ రమేష్ మేకింగ్ బాగున్నప్పటికి కథలో దమ్ము లేకపోవడం అతను దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తను సక్సెస్ కాకపోవడానికి కూడా అదే కారణమని చెప్పొచ్చు…
ఇక ఇతనితోపాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓం రావత్ మీద కూడా భారీ గా నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అయింది… ఆయన ప్రభాస్ తో చేసిన ‘ఆది పురుష్’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. అలాగే ప్రభాస్ అభిమానులు సైతం అతన్ని భారీ ట్రోల్ చేశారు…ఇప్పటికి చేస్తూనే ఉన్నారు…