Rajasthan Royals
Rajasthan Royals : ఐసీఎల్ సీజన్ 18 టోర్నీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం ఓ సంచల నిర్ణయం తీసుకుంది. ఏకంగా జట్టు సారథినే మార్చేసింది. ఈ విషయాన్ని సంజు శాంసన్(Sanju Samson) సోషల్ మీడియా ద్వారా తెలిపినట్లు రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ చేసింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేని కారణంగా సంజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్(Impact Playor)రూల్ ప్రకారం అతను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే వారు జట్టుకు నాయకత్వం వహించకూడదన్న నిబంధన ఉంది. ‘సంజు శాంసన్ కేవలం బ్యాటర్‌గానే ఆడతాడు. తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తాడు‘ అని రాజస్థాన్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
Also Read : ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్లు ఔట్
మార్చి 23న తొలి మ్యాచ్
ఇదిలా ఉంటే.. మార్చి 23న హైదరాబాద్, మార్చి 26న కోల్‌కతా, మార్చి 30న చెన్నై జట్లతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ సారథిగా వ్యవహరిస్తారు. మరోవైపు సంజూ శాంసన్ తన ట్వీట్‌లో.. ‘నేను తొలి మూడు మ్యాచ్‌లలో పూర్తిస్థాయిలో ఆడేంత ఫిట్‌నెస్‌లో లేను. అందుకే బ్యాటర్(Batter)గా మాత్రమే బరిలోకి దిగాలని నిర్ణయించాను. జట్టును నడిపించేందుకు చాలామంది సమర్థులు ఉన్నారు. ఈ మూడు మ్యాచ్‌లలో రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహిస్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ అతనికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను‘ అని తెలిపాడు. 2019లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రియాన్ పరాగ్ ఇప్పటివరకు జట్టుకు నాయకత్వం వహించలేదు. ఈ సీజన్లో అతనికి తొలిసారి ఈ బాధ్యత దక్కింది. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రియాన్ 573 పరుగులు సాధించాడు.
సంజు శాంసన్ వేలికి శస్త్రచికిత్స..
ఇంగ్లండ్(England)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని ఆడే క్రమంలో సంజు గాయపడ్డాడు. గత నెలలో అతను తన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ సమయంలో అతను బెంగళూరు(Benglor)లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌టెన్స్‌లో చికిత్స పొందాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం గత సోమవారం రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో చేరాడు. అయితే, పూర్తి ఫిట్‌నెస్ లేని కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగే అవకాశం ఉంది. దీంతో తొలి మూడు మ్యాచ్‌లలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
Also Read : గత ఏడాది ఫైనల్లోకి.. ఈ ఏడాది SRH పరిస్థితి ఏంటో.. జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయంటే..