Nagarjuna
Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తనదైన పంధాలో నడుస్తూ, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, టాలీవుడ్ టాప్ 3 హీరోలలో ఒకడిగా నిలిచాడు. కామెడీ, మాస్, యాక్షన్, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామా, భక్తి రసం, జానపదం ఇలా అన్ని తరహా జానర్స్ లో నటించిన అతి తక్కువ మంది హీరోలలో ఒకరు ఆయన. హలో బ్రదర్ లాంటి మాస్ కమర్షియల్ మూవీ చేసిన నాగార్జునే ‘అన్నమయ్య’ లాంటి సినిమా చేసాడు. ఆరోజుల్లో ఆయన వేరియేషన్స్ ఏ రేంజ్ లో ఉండేవో మీరే అర్థం చేసుకోండి. నేటి తరం స్టార్ హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం ప్రయోగాత్మక సినిమాల ద్వారా సక్సెస్ లను అందుకొని టాలీవుడ్ ఆడియన్స్ సినిమాలను చూసే మైండ్ సెట్ ని మార్చేసి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు.
అయితే నాగార్జున చేసిన ప్రయోగాలు ఒకప్పుడు సక్సెస్ అయ్యాయి కానీ, ఇప్పుడు విఫలం అవుతున్నాయి. గత కొంతకాలం నుండి నాగార్జున బాక్స్ ఆఫీస్ వద్ద వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎగురుకుంటూ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురి చేస్తున్నాడు. ఆయన గత చిత్రాలు కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి అంటే, ఎంతటి డిజాస్టర్ ఫేస్ లో ఉన్నాడో అర్థం చేసుకోండి. ఆయన తోటి సీనియర్ హీరోలు మాత్రం నేటితరం స్టార్ హీరోలతో ధీటుగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ రికార్డుల మీద రికార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం బాగా డౌన్ అయిపోయాడు. గత ఏడాది ‘నా సామి రంగ’ చిత్రంతో పర్వాలేదు అనే రేంజ్ హిట్ ని అందుకున్న ఆయన, ఈ ఏడాది ‘కూలీ'(Coolie Movie)|, ‘కుబేర'(Kubera Movie) చిత్రాల ద్వారా మన ముందుకు రాబోతున్నాడు నాగార్జున.
Also Read : నాగార్జున వెళ్ళిపోయినప్పుడే బిగ్ బాస్ కి మంచి రోజులు వస్తాయి – సోనియా
ఈ రెండు సినిమాల్లోనూ ఆయన హీరోగా చేయడం లేదు. కేవలం క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడంటే. అయితే ఆయన వందవ చిత్రంపై ఇప్పుడు సోషల్ మీడియా లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ వందవ చిత్రం ఆయన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ బ్లాక్ బస్టర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు దాదాపుగా 100 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన వందవ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. తమిళంలో ఈయన ‘నితం ఓరువానం’ అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం’ అనే పేరుతో విడుదలై మిరిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. వందవ చిత్రం కోసం నాగార్జున పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న ఇలా పలువురు ప్రముఖులు చెప్పిన స్టోరీలను విన్నాడు. కానీ అవి ఆయనకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది.
Also Read : 65 ఏళ్ల వయసులో ఇంత అందమా, నాగార్జున అమృతం తాగుతాడా ఏందీ? సెన్సేషనల్ లుక్ వైరల్