Pawan Kalyan Chandrababu : ఇటీవల కొద్దిరోజులుగా రాజకీయంగా ఆంధ్రాలో ఒక అలజడి జరగడానికి ప్రయత్నం జరిగింది. జనసేన ఆవిర్భావ సమావేశంలో పవన్ కళ్యాణ్, నాగబాబు వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి.. సోషల్ మీడియా, మీడియా హోరెత్తింది. తెలుగుదేశం సానుభూతిపరులు కూటమి విచ్చిన్నానికి తమ వంతు ప్రయత్నం చేశారు.
మూడు రకాలుగా ఈ విచ్చిన్న కారులను చూడొచ్చు. బీజేపీ పొడగిట్టని వామపక్ష భావజాలం కలిగిన వారు. టీడీపీ ముద్ర ఉన్నారు. జనసేన ఎక్కడ పెరుగుతుందోనని భయపడే టీడీపీ వారు.. మూడోది తెలుగుదేశం ఎవరి సహకారం లేకుండా ఎదగాలనుకునే టీడీపీ స్వపక్షీయులు..
కూటమి వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే సోషల్ మీడియాలో శక్తులు హోరెత్తుతున్నాయి. 2014లో ఇలానే మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగి కూటమి విచ్చిన్నమైంది. ఈసారి చంద్రబాబు ఆ తప్పుడు మాటలు నమ్మకుండా పొత్తుధర్మంతో ముందుకెళుతున్నాడు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబుల ఫెవికాల్ బంధానికి ఇప్పట్లో ఢోకా లేదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.