https://oktelugu.com/

Janhvi Kapoor: అతుకుల డ్రెస్ లో అన్నీ చూపిస్తూ.. శ్రీదేవి కూతురు ఇలా తయారయ్యిందేంటి!

Janhvi Kapoor: అతుకుల డ్రెస్ లో అందాలు చూపిస్తూ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మైండ్ బ్లాక్ చేసింది. అందాలు విందులో హద్దులు దాటేసిన యంగ్ హీరోయిన్ తెగింపుకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందాలన్ని కనిపిస్తుండగా అక్కడ దాచడానికి ఇంకేముంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ స్కై బ్లూ ట్రెండీ వేర్ లో ఫోటో షూట్ చేయగా… సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. జాన్వీ కపూర్ ఈ విషయంలో అసలు […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 12:48 PM IST
    Follow us on

    Janhvi Kapoor: అతుకుల డ్రెస్ లో అందాలు చూపిస్తూ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మైండ్ బ్లాక్ చేసింది. అందాలు విందులో హద్దులు దాటేసిన యంగ్ హీరోయిన్ తెగింపుకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందాలన్ని కనిపిస్తుండగా అక్కడ దాచడానికి ఇంకేముంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ స్కై బ్లూ ట్రెండీ వేర్ లో ఫోటో షూట్ చేయగా… సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి.

    Janhvi Kapoor

    జాన్వీ కపూర్ ఈ విషయంలో అసలు తగ్గడం లేదు. పబ్లిక్ లో కూడా జాన్వీ ధరించే డ్రెస్ లు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఆమె జిమ్ వేర్, షార్ట్స్ ధరించి సరదాగా వీధుల్లో తిరిగేస్తూ ఉంటారు. ఇక జాన్వీ కోసం ఫోటోగ్రాఫర్స్ సిద్ధంగా ఉంటారు. ఆమె అందాలను కెమెరాల్లో బంధించడానికి తహతహలాడుతూ ఉంటారు. జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్ తరచుగా విమర్శలకు గురవుతుంది.

    Also Read: Chiranjeevi- VV Vinayak: డైరెక్టర్ వివి వినాయక్ ని ఆదుకున్న చిరంజీవి!… ఈ వార్త నిజమేనా?

    Janhvi Kapoor

    ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే ధఢక్ చిత్రంతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. 2018 లో విడుదలైన ధఢక్ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. హీరోయిన్ గా కూతురు జాన్వీ ఎంతో ఎత్తుకు ఎదగాలని శ్రీదేవి ఆశపడ్డారు. అయితే కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలనే కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించగా… అప్పుడు దఢక్ మూవీ సెట్స్ పై ఉంది.

    Janhvi Kapoor

    జాన్వీ పరిశ్రమకు వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రెండు చిత్రాలు, ఓ యాంతాలజీ సిరీస్ చేశారు. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ మూవీలో ఆమె పైలట్ గా కనిపించారు. కెరీర్ బిగినింగ్ లోనే బయోపిక్స్ వంటి ఛాలెంజింగ్ రోల్స్ లో ఆమె నటిస్తున్నారు.

    Janhvi Kapoor

    అలాగే ఘోస్ట్ స్టోరీస్ టైటిల్ తో యాంతాలజీ సిరీస్ లో నటించారు. ఆమె గత చిత్రం రూహి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక జాన్వీ లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ. ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 29 నుండి స్ట్రీమ్ కానుంది.

    Janhvi Kapoor

    ఇక జాన్వీ ఖాతాలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిల్లి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో జాన్వీ నటిస్తున్నారు. చెప్పాలంటే జాన్వీకి సరైన బ్రేక్ ఇంకా రాలేదు. ఆమెకు భారీ కమర్షియల్ హిట్ ఇప్పటికీ దక్కలేదు. జాన్వీ కి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ రాకపోవడం విశేషం.

    Janhvi Kapoor

    కాగా టాలీవుడ్ నుండి ఆమెకు ఆఫర్స్ వస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినట్లు పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఆమెకు సౌత్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదనే వాదన ఉంది. శ్రీదేవి కూతురిగా జాన్వీకి సౌత్ లో యమ క్రేజ్ ఉంది.

    Janhvi Kapoor

    Also Read:Leak On Jailor Movie Story: రజినీకాంత్ ‘జైలర్’ స్టోరీ లీక్… ఇండస్ట్రీ హిట్ ఖాయం!

    Tags