Pawan Kalyan Son Debut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికి ఆయననుంచి సినిమా వస్తే చాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే ఆయన ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతను కొనసాగిస్తూనే తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్న యావత్ ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేయగలిగే కెపాసిటి తనకు ఉంది. గత సంవత్సరం ఆయన చేసిన ఓజీ సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు.
అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో ఆయన ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇప్పుడు మరో రెండు సినిమాలకు ఆయన కమిట్ అయినట్టుగా తెలుస్తోంది… తన కొడుకైన అఖిరా నందన్ సైతం సినిమాలకు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ యొక్క స్టార్ డమ్ ను నిలబెడుతూ ఆయన సినిమాలు చేయగలుగుతాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి సినిమా సక్సెస్ అయితేనే తర్వాత సినిమాల మీద బజ్ బాగా క్రియేట్ అవుతుంది.
ఒకవేళ మొదటి సినిమా కనక తేడా కొడితే మాత్రం ఆ హీరోలు తమ నెక్స్ట్ సినిమాలతో ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికీ అక్కినేని హీరోలు మొదటి సినిమాలతో ప్లాప్ లను మూటగట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి క్రమంలోనే అకిరా నందన్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని మెగా అభిమానులు సైతం కోరుకుంటున్నారు…