spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: దశాబ్దాలు గా ప్రకాశం జిల్లా వాసులు ఎదురుకుంటున్న సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాల నుండి ఫ్లోరైడ్ సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల్లో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ జల జీవం మిషన్ ఆద్వర్యం లో ‘అమరజీవి జలధార’ అనే మెగా తాగు నీటి పదహకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటి వరకు 40 శాతానికి పైగా పూర్తి అయ్యాయి అట. ఇంటెక్ వెల్స్ తో పాటు 200 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశారట.

అయితే ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా వర్షా భావ పరిస్థితులు నెలకొంటున్న ఏ నేపథ్యం లో , తాగు నీటి సమస్యని ఎదురుకునే ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఈ తాగు నీటి ప్రాజెక్ట్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భుజం సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన కోలుకున్న తర్వాత త్వరలోనే ఈ పనుల విషయం లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తానని, నిర్ణీత గడువులోపు ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చెయ్యాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపుగా 2500 కోట్లు కాగా, అందులో 1290 కోట్ల అంచనా వ్యవయంతోప్ ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 593 ఆవాసాలకు తాగు నీరు అందించనున్నారు. ఇంటేక్ వెల్ ఇప్పటికే 40 శాతం పూర్తి అయ్యింది. అదే విధంగా 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper