Kareena Kapoor: యూనిసెఫ్ ఇండియా(యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్‌ను ఎంపిక చేసింది. బాలివుడ్ స్టార్ కరీనా కపూర్‌ను కొత్త అంబాసిడర్గా ప్రకటించింది. 2014 నుంచి యూనిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న కరీనా ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పిల్లల హక్కును పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
గతంలో అడ్వయిజర్‌గా..
కరీనా కంపూర్ గతంలో యూనిసెఫ్ ఇండగియా సెలబ్రిటీ అడ్వయిజర్‌గా పనిచేశారు. ఇప్పుడు నూతన బాద్యతలు స్వీకరించారు. భారత జాతీయ రాయబారిగా యూనిసెఫ్‌తో తన అనుబంధం కొనసాగడం తనకు దక్కిన గౌరవం అని కరీనా పేర్కొన్నారు. ప్రతీ బిడ్డకు బాల్యం సమానమైన అవకావం, భవిష్యత్తు అవసరమని పేర్కొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక చోప్రా..
కరీనాకపూర్‌ను యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ప్రకటించిన తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కొత్త అంబాసిడర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక చోప్రా గతంలో పదేళ్లు యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్‌గా పనిచేశారు.
యూత్ అడ్వకేట్‌ను కూడా..
ఇక యూనిసెఫ్ కరీనాతోపాటు మొట్టమొదటి యూత్ అడ్వకేట్‌లను కూడా నియమించింది. వీరు క్లైమేట్ యాక్షన్, మెంటల్ హెల్త్, ఇన్నోవేషన్స్, గర్ల్స్ ఇన్ స్టెమ్(సైన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) వంటి సమస్యలపై పీర్ లీడర్లు, ఛాంపియన్లుగా ఉన్నారు. నలుగురు న్యాయవాదులు మధ్యప్రదేశ్‌కు చెందిన గౌరన్షిశర్మ, ఆడుకునే హక్కు, వైకల్యాన్ని చేర్చడం, వాతావరణ చర్యలు, పిల్లల హక్కుల నాయ్యయవాదంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తీక్‌వర్మ ఎంపికయ్యారు. మానసిక ఆరోగ్యం, బాల్య అభివృద్ధిపై అసోం నుంచి గాయకుడు నహీద్ ఆఫ్రిన్ ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన వినీషా ఉమాశంకర్ వర్ధమాన ఆవిష్కర్త, స్టెమ్ మార్గదర్శకురాలిగా ఉంటారు.