Bro Movie Twitter Review: బ్రో ట్విట్టర్ టాక్… సినిమా హిట్టా? పట్టా? జెన్యూన్ ఆడియన్స్ రివ్యూ ఇదే!

ట్విట్టర్ టాక్ ప్రకారం బ్రో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు సన్నివేశాలు రాసుకున్నారు. పవన్ ఎనర్జీ, డైలాగ్స్, డాన్సులు, కామెడీ టైనింగ్ అభిమానులను అలరిస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ చెప్పే పొలిటికల్ రిలేటెడ్ డైలాగ్స్ జనసైనికులకు గూస్ బంప్స్ కలిగిస్తాయి.

Written By: Shiva, Updated On : July 28, 2023 8:13 am

Bro Movie Twitter Review

Follow us on

Bro Movie Twitter Review: ఇద్దరు మెగా హీరోలు కలిసి మూవీ చేయడం అంటే ఫ్యాన్స్ లో ఉండే కిక్కే వేరు. బ్రో మూవీతో అది సాకారమైంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కలిసి ఈ ఫాంటసీ సోషల్ డ్రామా చేశారు. దర్శకుడు సముద్రఖని బ్రో చిత్రానికి దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. జులై 28న బ్రో వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ స్పందిస్తున్నారు.

బ్రో తమిళ చిత్రం వినోదయ సితం రిమేక్. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ ఇమేజ్ ఆధారంగా మూల కథలో కొన్ని మార్పులు చేశారు. మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) స్వార్ధపరుడు. ఎప్పుడూ స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తాడు. కుటుంబాన్ని, సన్నిహితులను కూడా పట్టించుకోకుండా పని చేస్తుంటాడు. తన జీవితంలో ఎవరికీ సరైన స్పేస్, టైం ఇవ్వడు. అలాంటి మార్కండేయ ప్రమాదంలో మరణిస్తాడు. అయితే టైం గాడ్(పవన్ కళ్యాణ్) అతనికి మరో అవకాశం ఇస్తాడు. టైం గాడ్ వచ్చాక మార్కండేయ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే బ్రో చిత్రం..

ట్విట్టర్ టాక్ ప్రకారం బ్రో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని దర్శకుడు గుర్తు చేశాడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు సన్నివేశాలు రాసుకున్నారు. పవన్ ఎనర్జీ, డైలాగ్స్, డాన్సులు, కామెడీ టైనింగ్ అభిమానులను అలరిస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ చెప్పే పొలిటికల్ రిలేటెడ్ డైలాగ్స్ జనసైనికులకు గూస్ బంప్స్ కలిగిస్తాయి.

సాయి ధరమ్ తేజ్ మామయ్యకు పోటీ ఇచ్చారు. తన పాత్రను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే పరుగెడుతోంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సన్నివేశాలు అలరిస్తాయి. కామెడీతో పాటు పవన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. పతాక సన్నివేశాలు కన్నీరు పెట్టిస్తాయి.

నిర్మాణ విలువలు బాగున్నాయి. థమన్ సాంగ్స్ పరంగా ఓకే, బీజీఎమ్ అయితే అదరగొట్టాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉన్నాయి. అయితే కథ, కథనాలు నిరాశపరిచాయి. ఎమోషన్స్ పూర్తి స్థాయిలో పండలేదు. మొత్తంగా బ్రో గుడ్ మూవీ. ఫ్యాన్స్ కి అయితే పిచ్చగా నచ్చుతుంది. బాగా కనెక్ట్ అవుతుంది. బ్రో ట్విట్టర్ టాక్ ఇలా ఉంది.

https://twitter.com/VVM9999/status/1684740151552167936