https://oktelugu.com/

Pawan Kalyan: కన్నడ పవర్ స్టార్ మృతిపై స్పందించిన … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 29, 2021 / 07:43 PM IST
    Follow us on

    Pawan Kalyan: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణ వార్త సినీ ప్రేక్షకులను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు గుండె పోటు తో మరణించిన సంగతి తెలిసిందే. కాగా పునీత్ మరణం పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.  ప్రముఖ నటులు, కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ గారి కుమారుడిగా… ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగిస్తున్న పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొన్నారని పవన్ పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షలకు బాధాకరం అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు.

    పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని… ఆ వార్త నమ్మశక్యం కాలేదని పవన్ అన్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.