T20 World Cup: న్యూజిలాండ్ తో టీమిండియా జట్టు ఇదేనట?

T20 World Cup: పాకిస్తాన్ చేతిలో చిత్తయిన టీమిండియా ఇప్పుడు చావో రేవో లాంటి న్యూజిలాండ్ తో పోరుకు రెడీ అయ్యింది. విచిత్రం ఏంటంటే న్యూజిలాండ్ ది కూడా మన పరిస్థితియే. పాకిస్తాన్ చేతిలో ఈ జట్టు కూడా దారుణంగా ఓడిపోయింది. సో గ్రూపు టాపర్ గా ఉన్న పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో నిలవాలంటే ఇప్పుడు మనం చేయాల్సింది న్యూజిలాండ్ ను ఖచ్చితంగా ఓడించడం.. ఓడిపోతే మాత్రం టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయంగా […]

Written By: NARESH, Updated On : October 29, 2021 8:02 pm
Follow us on

T20 World Cup: పాకిస్తాన్ చేతిలో చిత్తయిన టీమిండియా ఇప్పుడు చావో రేవో లాంటి న్యూజిలాండ్ తో పోరుకు రెడీ అయ్యింది. విచిత్రం ఏంటంటే న్యూజిలాండ్ ది కూడా మన పరిస్థితియే. పాకిస్తాన్ చేతిలో ఈ జట్టు కూడా దారుణంగా ఓడిపోయింది. సో గ్రూపు టాపర్ గా ఉన్న పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో నిలవాలంటే ఇప్పుడు మనం చేయాల్సింది న్యూజిలాండ్ ను ఖచ్చితంగా ఓడించడం.. ఓడిపోతే మాత్రం టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

team india

టీమిండియా జట్టు కూర్పు ఇప్పుడు కానకష్టంగా మారింది. ఎవరిని తుదిజట్టులో ఉంచాలి? ఎవరిని తీసివేయాలన్నది అంతుబట్టడం లేదు. దీనిపైనే మల్లగుల్లాలు పడుతున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ తొందరగా ఔట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది. అందుకే ఇప్పుడు ఫాంలో ఉన్న ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని.. అతడికి ఓపెనింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని.. అతడు పవర్ ప్లేలో 60-70 పరుగులు సాధించగల నేర్పరని అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ఇషాన్ కచ్చితంగా ఆడాలని.. అది జట్టుకు ఎంతో ముఖ్యమన్నాడు. యువ బ్యాట్స్ మెన్ రోహిత్ తో కలిసి బరిలోకి దిగితే టీమిండియాకు శుభారంభం దక్కుతుందని తెలిపాడు. పవర్ ప్లేలో అతడు ఉంటే భారత్ స్కోరు 60-70 పరుగులుగా నమోదవుతుందని తెలిపాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుందని తెలిపాడు.

రోహిత్ ఇషాన్ కలిసి ఓపెనింగ్ చేయాలని.. తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషప్ పంత్, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ కు రావాలని భజ్జీ సూచించాడు. సూర్యకుమార్ యాదవ్ ను పక్కనపెట్టాలని సూచించాడు.

ఇక బౌలర్లలో రవీంద్రజడేజా, శార్ధుల్ ఠాకూర్, బుమ్రా, షమీలను తీసుకోవాలని సూచించాడు. హర్ధిక్ లాంటి ఆటగాడు చివరలో ఉండడం కీలకమని.. అతడిని ఆడించాలని సూచించాడు. వరుణ్ చక్రవర్తికి విశ్రాంతినిచ్చినా తప్పులేదన్నారు. అతడికి అనుభవం రావాలన్నారు.