‘పవర్ స్టార్..’ ఈ పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఈ సౌండ్ వినిపిస్తే చాలు.. ఫ్యాన్స్ తమను తాము మైమరచిపోతారు. పూనకాలతో ఊగిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్ సొంతం. అలాంటి పవన్ ఇక సినిమాలకు దూరమయ్యాడని ఫ్యాన్స్ మదనపడుతున్న వేళ.. వకీల్‌సాబ్ తో రీ-ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్.
దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించాడు. దీంతో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. అభిమానుల ఆనందానికైతే హద్దే లేకుండాపోయింది. అయితే.. పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటించాల్సి రావడంతో.. ఎలా తెరకెక్కిస్తున్నారో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే.. అమెరికాతోపాటు దుబాయ్, ఆస్ట్రేలియాలో ప్రీమియర్స్ పడ్డాయి. అన్నివైపుల నుంచీ సూపర్ హిట్ టాక్ వచ్చేస్తోంది.
ఈ సినిమాలో వకీల్ సాబ్ గా పవన్ విశ్వరూపం ప్రదర్శించాడని అంటున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ నటన ఎవరెస్టుపై ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా కోర్టు సీన్లు దద్దరిల్లిపోయాయని చెబుతున్నారు. సినిమాను కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారని, పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటిగా మిగిలిపోతుందని, ఈ సినిమాతో పవర్ స్టార్ ను మూడేళ్లుగా ఎంత మిస్సయ్యామో అర్థమవుతోందని అంటున్నారు. మొత్తంగా.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయినట్టేనని చెబుతున్నారు.
అయితే.. ఈ సినిమా నిడివి 155 నిమిషాలు. ఇందులో పవన్ కనిపించేది కేవలం 50 నిమిషాలు మాత్రమే అని అంటున్నారు. ఇలాంటి సినిమాకు పవన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. నిమిషానికి కోటి రూపాయల చొప్పున పవన్ 50 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. అయితే.. ఇది సినిమా ప్రారంభానికి ముందుకు తీసుకున్న పారితోషికం.
ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న వార్తల నేపథ్యంలో.. ఈ పారితోషికం డబుల్ అయ్యిందని చెబుతున్నారు. ఏకంగా పవన్ కు రూ.100 కోట్లు చెల్లించబోతున్నారట మేకర్స్! తెలుగు ఇండస్ట్రీలో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న మొట్ట మొదటి హీరోగా పవన్ చరిత్ర సృష్టిస్తున్నారని అంటున్నారు.