Pawan Kalyan Returns Remuneration : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ఈ నెల 12 వ తారీఖున విడుదల చేయడానికి సిద్దమైన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. నిన్న సెన్సార్ కార్యక్రమాలు చేయించడానికి సిద్ధమయ్యారు. మొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్, అదనపు షోస్ కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకున్నారు. ఈ నెల 8వ తేదీన తిరుపతి లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి జూన్ 12 న విడుదల చేయడానికి మొత్తం సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదలకు ఒకటి కాదు రెండు కాదు, వరుసగా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇరాన్, సింగపూర్ వంటి దేశాల నుండి VFX కంటెంట్ రావాల్సి ఉంది. డీల్ ప్రకారం నిన్న ఈ VFX షాట్స్ డెలివరీ అవ్వాలి.
కానీ కొన్ని VFX వర్క్ ఇంకా పూర్తి కాలేదని, వారం రోజుల సమయం అదనంగా కావాలని కంపెనీ వాళ్ళు కోరడం తో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు అవ్వలేదు. దానికి తోడు ఈ నెల 10 వ తేదీన నిర్మాత AM రత్నం ఫైనాన్షియర్స్ కి 200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సినిమాకు సంబంధించిన బిజినెస్ అంత జరగలేదు. కేవలం 160 కోట్ల రూపాయిలు ఇవ్వడానికి బయ్యర్స్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. కానీ AM రత్నం పట్టు వదలకుండా ఈ చిత్రాన్ని తానూ అనుకున్న రేట్ కి అమ్మాలని చూస్తున్నాడు. అందుకు ట్రైలర్ ని సిద్ధం చేసి సినిమా రేంజ్ ఏంటో తెలిసేలా చేస్తే తాను కోరుకున్న రేట్స్ దొరుకుంటుందని ఆయన ఆశ. కానీ ట్రైలర్ కి VFX షాట్స్ అవసరం ఉన్నది.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
అవి ఇంకా సిద్ధం కాకపోవడం తో ఆయన బిజినెస్ ని క్లోజ్ చేయలేదు. నిర్మాత బాధలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతం లో ఆయన నుండి తీసుకున్న 11 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేశాడట. అంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు అన్నమాట. కేవలం నిర్మాత రత్నం మీద ఆయనకు ఉన్న అభిమానం, సినిమాల మీద ఆయనకు ఉన్న విపరీతమైన ఇష్టాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కష్టపడినట్టు ఆయన కెరీర్ లో ఏ చిత్రం కోసం కూడా కష్టపడలేదు. కేవలం ఒక్క ఫైట్ సన్నివేశం కోసమే ఆయన రెండు నెలల సమయాన్ని కేటాయించాడంటే ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అంత కష్టపడి పైసా రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం అభిమానులను తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుంది.