Pawan Kalyan Remuneration: భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్స్ ని అందుకునే టాప్ 5 హీరోల లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పేరు కచ్చితంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్ హీరో కాకపోయినా, రీజనల్ మార్కెట్ లో ఆయనకు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తుంటాయి కాబట్టే, ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక బాగా బిజీ అవ్వడంతో అడ్వాన్స్ తీసుకొని చేస్తానన్న మూడు సినిమాలు చాలా ఆలస్యం అయ్యింది. నిర్మాతలకు అందువల్ల వడ్డీల రూపం లో చాలా నష్టం జరిగింది. అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు ఓజీ చిత్రం చేస్తున్నాడు.
Also Read: భారత్–పాకిస్థాన్ సీజ్‌ఫైర్.. నేటి ముగియనున్న గడువు.. తర్వాత ఏం జరుగుతుంది?
గత రెండు మూడు రోజుల నుండి హైదరాబాద్ లో విరామం లేకుండా షూటింగ్ జరుగుతుంది, ఎల్లుండి నుండి షూటింగ్ ముంబై కి షిఫ్ట్ కానుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సెప్టెంబర్ 25 న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే నిన్నటి నుండి మీడియా లో ప్రచారం అవుతున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న మూడు సినిమాలకు అడ్వాన్స్ రెమ్యూనరేషన్ కొంత తీసుకున్నాడు. మిగిలిన బ్యాలన్స్ సినిమాలు పూర్తి అయిన వెంటనే నిర్మాతలు ఆయనకు ఇవ్వాలి. కానీ తన వల్ల షూటింగ్ కార్యక్రమాలు చాలా ఆలస్యం అయ్యాయి, నిర్మాతలకు ఎంతో నష్టం జరిగింది, దాని కోసం నేను మిగిలిన బ్యాలన్స్ రెమ్యూనరేషన్ తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను అని తన నిర్మాతలకు ఇటీవలే ఫోన్ చేసి చెప్పాడట.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇష్టమొచ్చినట్టు అందరికీ దానధర్మాలు చేస్తుంటావు, అలాంటిది ఇప్పుడు రెమ్యూనరేషన్ వద్దు అంటావు, మరి డబ్బులు ఎలా వస్తాయి అన్నా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు రెమ్యూనరేషన్ తీసుకోకపోవచ్చు కానీ, సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో మాత్రం తీసుకునే అవకాశం ఉందని మరికొంత మంది అంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం 11 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకున్నాడు. సినిమా సూపర్ హిట్ అయితే లాభాల్లో వాటాలు వస్తాయి, లేకపోతే లేనట్టే. 11 కోట్ల రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ 2010 వ సంవత్సరం లో తీసుకునే వాడు. నిర్మాత AM రత్నం తో తనకు ఉన్నటువంటి అత్యంత సాన్నిహిత్యం కారణంగానే ఆయనకు ఇంత తోడ్పాటు అందిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.