Mission Impossible The Final Reckoning: హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ అయితే దక్కుతూ ఉంటుంది. ఇక ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగులో భారీ మార్కెట్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇక ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది…ఈ సినిమా ఎలా ఉంది? మొదటి పార్ట్ ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ మూవీ అంతకంటే గొప్ప విజయాన్ని సాధించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే మొదటి పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ మూవీ అక్కడి నుండే స్టార్ట్ అయింది…ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏ ఐ) ది ఎంటిటి ని నియంత్రించగలిగే తాళాలను సంపాదించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు… ఆ తాళాలు వాళ్లకు అందకుండా ఏంఐ ఏజెంట్ ఈధన్ హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు… ఆ దుండగులు సముద్ర గర్భంలో మునిగిపోయిన సబ్ మెరైన్ లో ఒరిజినల్ సోర్స్ కోడ్ ఉంటుంది దాన్ని కనిపెట్టి నాశనం చేస్తారు…దీని ద్వారా ఏం జరిగింది…ఈధన్ హంట్ వాళ్ల నుంచి ప్రపంచాన్ని ఎలా రక్షించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘క్రిస్టోఫర్ మెక్ క్వారీ’ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ లో కొన్ని కీలకమైన అంశాలను జోడించి దానిని త్రిల్లింగ్ ఎలిమెంట్స్ గా మారుస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాకుండా టామ్ క్రూజ్ యొక్క పూర్తి పోటెన్షియాల్టిని వాడుకొని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టడనే చెప్పాలి…
ప్రతి సీన్లో ఒక క్యూరియాసిటీ ని రేకెత్తించే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రీట్మెంట్ రాసుకొని సినిమాని ఆధ్యాంతం ఎక్కడ బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి పార్ట్ లో యాక్షన్ ఎలిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ పార్ట్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ ను ఎలివేట్ చేశారు…అమెరికా అధ్యక్షురాలి మాట మేరకు ఈధన్ హంట్ రంగంలోకి దిగి అందరిని కాపాడే ప్రయత్నం చేయడం చేస్తాడు…
మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడు చాలా వరకు సక్సెస్ ని సాధించాడు. ఇక మిషన్ ఇంపాజిబుల్ రెండో పార్ట్ గా వచ్చిన ఈ మూవీని సక్సెస్ ఫుల్ గా నిలిపి ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు… ఈ వీకెండ్ లో ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. హాలీవుడ్ సినిమాలను యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాలోని చూడాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూస్తే మాత్రం తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతూ యాక్షన్ ని ఎంజాయ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే హీరోగా చేసిన టామ్ క్రూజ్ ఇంతకుముందు పలు సినిమాల్లో నటుడిగా నటించడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సినిమాతో సైతం మరోసారి తను మంచి నటుడు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. హేలే అట్వీల్ సైతం ది బెస్ట్ నటనను కనబరిచే ప్రయత్నం అయితే చేశాడు…వింగ్ రెహమ్స్, సిమన్ పెగ్ లాంటి నటులు కూడా వాళ్ల పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉండటంతో చాలా బాగా నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…మ్యాక్స్ అరుజ్, ఎలైఫ్ గాడ్ ఫ్రే ఇచ్చిన మ్యూజిక్ బాగుంది…ఈ సినిమా థీమ్ కి చాలా బాగా సెట్ అయింది…అలాగే సినిమాటోగ్రాఫర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి… ప్రతి షాట్ కూడా సినిమా చూసే ప్రేక్షకుడిలో ఒక జోష్ అయితే నింపుతుంది…అలాగే యాక్షన్ ఎలిసోడ్స్ లో వాడిన షాట్స్ నిజంగా అల్టిమేట్ అనే చెప్పాలి…ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
టామ్ క్రూజ్
యాక్షన్ ఎపిసోడ్స్
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5…