Pawan Kalyan Coolie Movie: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులే కాదు, సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ నే ఒక డైనోసార్ లాంటిది అనుకుంటే, ఆ కాంబినేషన్ లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), అమీర్ ఖాన్,(Aamir Khan) ఉపేంద్ర, సౌరబ్ సాహిర్ వంటి వారు తోడు అవ్వడం తో పాటు, అనిరుద్ అందించిన అద్భుతమైన పాటలు ఈ సినిమా పై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లాయి. ఏ రేంజ్ అంచనాలు అంటే మూవీ టీం కూడా ఆ అంచనాలను తట్టుకోలేక, స్లో ట్రైలర్ కట్ తో అంచనాలను కాస్త తగ్గించే ప్రయత్నం చేసేంత రేంజ్ అన్నమాట. ట్రైలర్ చూసినప్పుడు పెద్దగా కిక్ రాలేదు కానీ, ఆ ట్రైలర్ ని బేస్ చేసుకొని సోషల్ మీడియా లో విశ్లేషకులు వాళ్లకి తోచిన విశ్లేషణలు చేస్తూ ఉన్నారు.
అందులో ఒక విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ చేత నవ్వులు పూయిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ట్రైలర్ లోని ఒక షాట్ లో రజినీకాంత్ క్రింద పడుకొని స్టైల్ గా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ షాట్ ని చూసిన తర్వాత మాకు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది అంటూ, ఆ షాట్ తో పోలుస్తూ ఒక ఫోటో ని అప్లోడ్ చేశారు నెటిజెన్స్. అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోలీసుల చర్యలకు విసుగెత్తి పోయి రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేస్తాడు.
Also Read: బాలకృష్ణ బాటలో ఎన్టీఆర్… నంబర్ 1 కాలేడా..?
ఆ సమయం లో టాప్ యాంగిల్ నుండి తీసిన ఒక ఫోటో ని, కూలీ లోని రజినీకాంత్ డ్యాన్స్ ఫోటో తో పోలుస్తూ సోషల్ మీడియా లో కొన్ని ఫన్నీ ట్రోల్స్ వేశారు నెటిజెన్స్. దీనికి పవన్ అభిమానులు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కి పవన్ కళ్యాణ్ అలా రోడ్డు మీద పడుకున్న టాప్ యాంగిల్ షాట్ ని నచ్చి, అదే తరహాలో రజనీకాంత్ తో రీ క్రియేట్ చేయించి ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా కూలీ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ టికెట్స్ కి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఇప్పటి వరకు ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో దాదాపుగా అన్ని థియేటర్స్ లో టికెట్స్ అయిపోయాయి. కొత్త షోస్ కోసం అక్కడి ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ రేంజ్ క్రేజ్ ఈ చిత్రానికి ఓవర్సీస్ లో ఉన్నది. ఇక ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.