Jr NTR vs Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తన హవాని కొనసాగించి ఇండియా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. ఇక సినిమా హీరో గానే కాకుండా రాష్ట్రానికి సీఎంగా కూడా తన పదవి బాధ్యతలను కొనసాగించి జనాల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఒకానొక సందర్భంలో బాలయ్య నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటాడు అంటూ తీవ్రమైన వార్తలు వచ్చినప్పటికి ఆయన మాత్రం ఆ పోజిషన్ కి చేరుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ అతనికి చాలావరకు మైనస్ అయ్యాయనే చెప్పాలి. అందువల్లే ఆయన చిరంజీవిని బీట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోలేకపోయాడు అంటూ ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్య బాబు బాటలో నడుస్తున్నాడని మరి కొంతమంది చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా నిలుస్తున్నప్పటికి ఆయన కెరియర్ ను టర్న్ చేసే సినిమాలు మాత్రం రావడం లేదు. ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకునే సినిమాలు పడినప్పుడే ఆయా హీరో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గరవుతాడు.
Also Read: అందరు మాస్ డైరెక్టర్లు అవ్వలేరా..?ఇది తెలుసుకుంటే ప్లాప్ సినిమాలు రావా..?
అలా కాకుండా వరుస సినిమాలు చేస్తున్న కూడా సక్సెస్ లు వచ్చినప్పటికి స్టార్ డమ్ అనేది రాదనే చెప్పాలి. ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు కాబట్టి ఈయనకి కూడా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చాలామంది చెబుతున్నారు.
అలా కాకుండా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలేంటి అలాంటి కథలను అంచనా వేసి అలాంటి సినిమాలను చేసినప్పుడే జూనియర్ ఎన్టీఆర్ సైతం ముందు వరుసలో దూసుకెళ్తారని మరి కొంతమంది చెబుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటికైన తను నడుస్తున్న మార్గాన్ని గమనించి మంచి సినిమాలు చేయడానికి అలాగే ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ను భర్తీ చేసే హీరో ఎవరో తెలిసిపోయిందా..?
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి వాళ్ళు చేసే ఆరాటమైతే అంత ఇంతా కాదు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కూడా నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడేలా ఆయన్ని ముందుకు తీసుకెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…