James Cameron vs Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. దర్శక ధీరుడిగా ఒక మంచి పేరు సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం. ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేసి ప్రపంచ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ‘జేమ్స్ కామెరూన్’ లాంటి దిగ్గజ దర్శకుడిని సైతం మెప్పించిన రాజమౌళి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో మరోసారి హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మైమరిపింపచేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే జేమ్స్ కామెరూన్ చేస్తున్న అవతార్ 3 సినిమాకు సంబంధించిన ట్రైలర్ గత రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. డిసెంబర్ 19వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను రాబడుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: బాలకృష్ణ బాటలో ఎన్టీఆర్… నంబర్ 1 కాలేడా..?
మరి ఈ సినిమాతో పాటు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాకి కొంతమంది కొన్ని పోలికలైతే పెడుతున్నారు. మరి ‘అవతార్ 3’ సినిమా సాధించిన వసూళ్లను మహేష్ బాబు సినిమాతో రాజమౌళి కనక సాధిస్తే జేమ్స్ కామెరూన్ ను మించిన దర్శకుడిగా రాజమౌళి మారతాడా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి రోజు రోజుకి తన పరిధిని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ సినిమా ఎంతటి వసూళ్లను సాధిస్తోంది అనేది పక్కన పెడితే రాజమౌళి మాత్రం తను మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మూడు వేల కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: పూరి జగన్నాథ్ – చిరంజీవి కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదు..!
తను అనుకున్నట్టుగానే ఆ రేంజ్ లో కలెక్షన్స్ ని కొల్లగొడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి పరిచయం చేస్తున్న రాజమౌళి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతోంది…