Kingdom OTT Release: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. డీసెంట్ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో యావరేజ్ రేంజ్ కి వెళ్తుందని అందరు అనుకున్నారు. కానీ సోమవారం వచ్చిన వసూళ్లు చూస్తే డిజాస్టర్ అయ్యేట్టుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉదాహరణకి కృష్ణ జిల్లాలో నిన్న షేర్ వసూళ్లు రాకపోగా, మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే జిల్లా మొత్తం డెఫిసిట్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట. కేవలం కృష్ణా జిల్లా ఒక్కటే కాదు, అన్నీ ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. నిన్న బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి కేవలం 20 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీనిని బట్టీ అర్థం చేఉస్కోవచ్చు ఏ రేంజ్ డిజాస్టర్ అనేది. నిన్న మొత్తం తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం 5 వ రోజున అందుకుంది.
Also Read: కూలీ’ లో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ సన్నివేశం..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
ఇదంతా పక్కన పెడితే విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు నెలఖారున విడుదల చెయ్యాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ తేదీన వచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పుకోలేదట, దీంతో మేకర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని జులై 31 న విడుదల చెయ్యాల్సి వచ్చింది . అయితే సినిమా విడుదలై దాదాపుగా రన్ మొత్తం పూర్తి అవుతున్న సందర్భంగా సాధ్యమైనంత తొందరగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత విడుదల చెయ్యాలి. అంటే ఆగష్టు 28 న అన్నమాట. కానీ ఇప్పుడు ఆగష్టు 24 నే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది. మరి థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించలేకపోయిన ఈ సినిమా, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.