ఒక వైపు రాజకీయం చేస్తూ… మరో వైపు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్‌మెంట్స్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సెట్స్ లో ఉండగానే మూడు సినిమాలు సైన్ చేశాడు. క్రిష్ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా హిస్టారిక్ డ్రామా మూవీ, సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్, ‘గబ్బర్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు.
Also Read: ‘క్రాక్’జోరులో ‘ఖిలాడి’ రవితేజ బర్త్ డే స్పెషల్
తాజాగా వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి ముస్తాబవుతుండగా లేట్ చెయ్యకుండా సాగర్.కె.చంద్ర మూవీని స్టార్ట్ చేశారు పవర్ స్టార్. ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తుండగా… ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించటంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి రిపబ్లిక్ డే కానుగా అభిమానులని సర్ప్రైజ్ చేశారు.
Also Read: బాలీవుడ్ స్టార్ హీరోతో ‘రాశీ ఖన్నా’ దాగుడు మూతలు !
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తున్న ప్రత్యేకమైన సెట్ కోసం కష్టపడుతున్న యూనిట్, సెట్ ని త్రివిక్రంతో పాటు పర్యవేక్షిస్తున్న డైరెక్టర్ సాగర్, కార్ లో నుండి దిగుతున్న పవన్ కనిపించటం, పవన్ తో కలిసి త్రివిక్రమ్ టీ తాగుతూ సరదాగా మాట్లాడుకోవటం ఈ వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ఈ వీడియోకి ఎస్.థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా స్పెషల్ గా ఉంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. అంటే పవన్ మూడు సినిమాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుండటంతో మెగా అభిమానులకి పండగే పండుగన్నమాట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్